News April 17, 2024
వైసీపీ నేతలను తన్ని తరిమేయండి: పవన్

AP: వైసీపీ నేతలను తన్ని తరిమేయాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ‘మా కులాల నేతలతోనే మమ్మల్ని తిట్టిస్తున్నారు. మాలో మేమే కొట్టుకునేటట్లు చేస్తున్నారు. వైసీపీ పాలనలోనే బాబు, లోకేశ్‌పై కేసులు ఎక్కువగా పెట్టారు. ఓడిపోతామన్న బాధలోనే జగన్ కోపంతో ఉన్నారు. తమ కూటమి అధికారంలోకి వస్తే వైసీపీ నేతలకు తగిన శిక్ష విధిస్తాం’ అని ఆయన హెచ్చరించారు.
Similar News
News January 30, 2026
రోజుకు లక్షన్నర బ్యారెల్స్.. రష్యా నుంచి ఇండియాకు!

రష్యా నుంచి పెద్దమొత్తంలో క్రూడాయిల్‌ను రిలయన్స్ సంస్థ కొనుగోలు చేయనుంది. ఫిబ్రవరి నుంచి రోజూ సుమారు 1.5 లక్షల బ్యారెల్స్ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటామని కంపెనీ చెప్పిందని రాయిటర్స్ తెలిపింది. అమెరికా ఆంక్షల లిస్టులో లేని రష్యన్ కంపెనీల నుంచి రానున్న 2 నెలలు కొననుందని వెల్లడించింది. US ఆంక్షల నుంచి మినహాయింపు తీసుకుని డిసెంబర్‌లోనూ రష్యా క్రూడ్‌ను కొనిందని చెప్పింది.
News January 30, 2026
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీలో పోస్టులు

<
News January 30, 2026
ఫిబ్రవరి 3న ఏపీ క్యాబినెట్ భేటీ

AP: వచ్చే నెల 3న క్యాబినెట్ సమావేశం కానుంది. రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ఫిబ్రవరి 11 నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో దానికి సంబంధించిన అంశాలతో పాటు కీలక ఇష్యూలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈ నెల 28న మంత్రివర్గ సమావేశం జరిగిన విషయం తెలిసిందే. వారం రోజుల వ్యవధిలోనే మరోసారి క్యాబినెట్ భేటీ నిర్వహిస్తుండడం విశేషం.


