News July 23, 2024
కిడ్నాప్ వార్త ఫేక్: పోలీసులు

TG: హైదరాబాద్‌లో అమ్మాయిలను హ్యూమన్ ట్రాఫికింగ్ రాకెట్ ట్రాప్ చేస్తోందన్న ప్రచారంపై పోలీసులు స్పందించారు. రెండ్రోజుల క్రితం తార్నాక మెట్రోస్టేషన్ వద్ద ఓ విద్యార్థినిని కిడ్నాప్ చేయగా పోలీసులు రక్షించారనే వార్త సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. అయితే ఇదంతా అవాస్తవమని పోలీసులు తెలిపారు. విద్యార్థిని కిడ్నాప్‌కు గురైన ఘటన ఏదీ జరగలేదని చెప్పారు. ఫేక్ న్యూస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
Similar News
News January 22, 2026
సరస్వతీ దేవి అనుగ్రహం కోసం రేపేం చేయాలంటే

అమ్మవారి అనుగ్రహం కోసం భక్తులు పసుపు దుస్తులు ధరించాలి. పూజలో తెల్లని పూలు, గంధం సమర్పించి ‘ఓం ఐం సరస్వత్యై నమః’ మంత్రాన్ని జపించాలి. నైవేద్యంగా చక్కెర పొంగలి, కేసరి, పులిహోరను సమర్పించాలి. పేద విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు దానం చేయడం వల్ల అమ్మవారు ప్రసన్నులవుతారు. పూజా సమయంలో పుస్తకాలను అమ్మవారి పాదాల చెంత ఉంచి ప్రార్థించడం వల్ల విద్యార్థుల్లో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయని పురాణ వచనం.
News January 22, 2026
పాజిటివ్ థింకింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలంటే?

ఎప్పుడైనా ప్రతికూల ఆలోచనలు వెంబడిస్తుంటే, అందుకు రివర్స్‌లో.. ‘అలా జరగదు.. ఇలా జరుగుతుంది.. అలా కాదు.. ఇలా అవుతుంది’ అని మనసులోనే మాటలు అల్లుకోవాలి. కృతజ్ఞతా భావాన్ని పెంచాలి. ఒక మనిషితో ఎలా మాట్లాడతామో, మనసుతో కూడా అలానే మాట్లాడుకోగలగాలి. ఆ చర్చ, ఆ ఆలోచన పరిష్కారం దిశగా ఉండాలి. నిద్రలేచిన వెంటనే మంచి ఆలోచనలతో రోజును ప్రారంభించాలి. ఏ చిన్న విజయాన్నైనా సెలబ్రేట్ చేసుకోండి.
News January 22, 2026
AIIMS కల్యాణి 47 పోస్టులకు నోటిఫికేషన్

<


