News December 11, 2024
నటుడు ముస్తాక్ ఖాన్ కిడ్నాప్.. చివరికి!
స్త్రీ-2, వెల్కమ్ చిత్రాల్లో నటించిన ముస్తాక్ ఖాన్‌ను దుండగులు కిడ్నాప్ చేశారు. గతనెల 20న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ‘ఓ అవార్డ్ ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన ఆయనను కిడ్నాప్ చేసి UP తీసుకెళ్లారు. గన్నుతో బెదిరించి 12 గంటలు టార్చర్ పెట్టారు. అతడి కొడుకుకి ఫోన్ చేసి రూ.కోటి డిమాండ్ చేశారు. ఇంతలో కిడ్నాపర్ల చెర నుంచి ముస్తాక్ తప్పించుకొన్నాడు’ అని ఆయన ఫ్రెండ్ శివమ్ తెలిపారు.
Similar News
News December 26, 2024
ప్రపంచంలోనే అతి పెద్ద డ్యామ్ నిర్మించనున్న చైనా
ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోపవర్ డ్యామ్‌ను నిర్మించేందుకు చైనా సిద్ధమవుతోంది. టిబెట్‌లోని యార్లంగ్ జాంగ్బో(బ్రహ్మపుత్ర) నదిపై దీన్ని నిర్మించనుంది. పూర్తైతే ఏడాదికి 300 బిలియన్ కిలోవాట్ విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అంచనా. దీని కోసం భారీగా నిధులు వెచ్చించనున్నట్లు బీజింగ్ వర్గాలు తెలిపాయి. బ్రహ్మపుత్ర నది భారత్‌లోని అరుణాచల్, అస్సాం రాష్ట్రాల మీదుగా బంగ్లాదేశ్‌లోకి వెళ్లి బంగాళాఖాతంలో కలుస్తుంది.
News December 26, 2024
అజెర్బైజాన్ విమానాన్ని కూల్చేశారా?
అజెర్బైజాన్లో నిన్నటి విమాన ప్రమాదం రష్యా దాడి వల్లే జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఫ్లైట్ అజెర్బైజాన్లోని బాకు సిటీ నుంచి రష్యాకు వెళ్తుండగా కుప్పకూలింది. ఆ సమయానికి రష్యా-ఉక్రెయిన్ మధ్య దాడులు జరుగుతున్నాయి. విమానాన్ని ఉక్రెయిన్ దాడిగా పొరబడి రష్యా ఎయిర్ డిఫెన్స్ దాన్ని కూల్చేసి ఉండొచ్చని పలువురు ఆరోపిస్తున్నారు. విమానం బాడీపై బులెట్ల ఆనవాళ్లుండటం దీనికి ఊతమిస్తోంది.
News December 26, 2024
అల్లు అర్జున్‌పై నాకెందుకు కోపం ఉంటుంది?: CM రేవంత్
TG: సినీ ప్రముఖులతో జరిగిన భేటీలో సీఎం రేవంత్ రెడ్డి హీరో అల్లు అర్జున్ గురించి ప్రస్తావించారు. ‘అల్లు అర్జున్‌పై నాకెందుకు కోపం ఉంటుంది? బన్నీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నాతో కలిసి తిరిగాడు. వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నా చట్టప్రకారం వ్యవహరించాలనేది నా విధానం’ అని రేవంత్ రెడ్డి సినీ పెద్దలతో వ్యాఖ్యానించారు.