News January 27, 2025
కిడ్నీ రాకెట్.. ప్రధాన సూత్రధారి అరెస్ట్

TG: సంచలనం రేపిన కిడ్నీ రాకెట్ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి డాక్టర్ పవన్ అలియాస్ లియోన్‌ను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నైకి పారిపోయిన అతడితో పాటు మరో వైద్యుడిని అదుపులోకి తీసుకున్నారు. సరూర్‌నగర్‌లోని అలకనంద ఆస్పత్రిలో అక్రమంగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేసి, ఒక్కో సర్జరీకి రూ.50-60లక్షలు వసూలు చేసినట్లు గుర్తించారు. తీవ్రత దృష్ట్యా ఈ కేసును ప్రభుత్వం CIDకి అప్పగించింది.
Similar News
News February 14, 2026
ఇరాన్‌లో అధికార మార్పిడే కరెక్ట్: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

ఇరాన్‌లో పాలన మారడమే ప్రపంచానికి మంచిదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇరాన్‌పై సైనిక చర్యకు సన్నద్ధమవుతూ ఇప్పటికే USS అబ్రహం లింకన్ యుద్ధనౌకను అమెరికా పంపింది. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ USS జెరాల్డ్ ఆర్.ఫోర్డ్‌ను కూడా అక్కడికి పంపుతోంది. ‘చర్చలు విఫలమైతే యుద్ధం తప్పదు’ అనే సంకేతాలిస్తూ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం మిడిల్ ఈస్ట్ దేశాలకు ఆందోళన కలిగిస్తోంది.
News February 14, 2026
భారీ జీతంతో దీన్‌దయాళ్ పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు

దీన్‌దయాళ్ పోర్ట్ అథారిటీ 9 పైలట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మాస్టర్ ఆఫ్ ఫారిన్ గోయింగ్ షిప్ సర్టిఫికెట్ కలిగినవారు మార్చి 14 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష/పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
నెలకు రూ.70,000-రూ. 2,00000 వరకు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.deendayalport.gov.in
News February 14, 2026
టాపార్డర్ ఓకే.. వీళ్లు కూడా రాణిస్తే!

T20 WCలో వరుసగా రెండు మ్యాచులు గెలిచిన టీమ్ ఇండియాకు బ్యాటర్ల నిలకడలేమి ఆందోళన కలిగిస్తోంది. ఇషాన్, సూర్య, హార్దిక్ రాణిస్తున్నా మిడిలార్డర్‌లో తిలక్, దూబే, రింకూ, ఆల్‌రౌండర్ అక్షర్ ఇంకా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. రేపు పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్ భారత్‌కు చాలా కీలకం. ఈ మ్యాచులోనైనా వీరు గాడిలో పడితే భారత్‌కు మరింత ప్రయోజనం చేకూరడంతో పాటు టాపార్డర్ మీద భారం తగ్గనుంది.


