News September 24, 2024
విటమిన్-సి సప్లిమెంట్లతో కిడ్నీల్లో రాళ్లు?

విటమిన్-సి కోసం చాలామంది సప్లిమెంట్లు తీసుకుంటుంటారు. వాటిని అతిగా వాడితే కిడ్నీలో కాల్షియం ఆక్సలేట్ రాళ్లు వచ్చే ప్రమాదం ఉందని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ వైద్యుడు విజయ్ కిరణ్ తెలిపారు. ‘ప్రతిరోజూ మహిళలకు 75 ఎంజీ, పురుషులకు 90 ఎంజీ విటమిన్-సి కనీసావసరం. కానీ దాని కోసం సప్లిమెంట్లను ఆశ్రయించడం శ్రేయస్కరం కాదు. బదులుగా విటమిన్లు సహజంగా లభించే ఆహారం తీసుకోవడం ఉత్తమం’ అని వివరించారు.
Similar News
News March 30, 2026
విద్యార్థులకు అలర్ట్.. సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోండి!

TG: కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో విద్యార్థులు తమకు అవసరమైన డాక్యుమెంట్స్‌ను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ముఖ్యంగా బోనాఫైడ్, స్టడీ, టీసీ, ఆధార్ కార్డులతో పాటు ఇన్కమ్, క్యాస్ట్, నేటివిటీ సర్టిఫికెట్లను దగ్గర ఉంచుకోవాలి. అడ్మిషన్లు, స్కాలర్‌షిప్‌ల సమయంలో ఇబ్బందులు కలగకుండా ముందుగానే సమీపంలోని మీసేవా కేంద్రాల్లో అప్లై చేసుకోండి. సులభంగా ఇన్కమ్, క్యాస్ట్, నేటివిటీ సర్టిఫికెట్లను పొందండి.
News March 30, 2026
4 లక్షల చాక్లెట్స్ చోరీ.. కంపెనీ ఫన్నీ రియాక్షన్!

4.14 లక్షల చాక్లెట్లు చోరీ కావడంపై నెస్లే బ్రాండ్ ‘కిట్ క్యాట్’ ఫన్నీగా స్పందించింది. ‘కిట్‌క్యాట్‌తో బ్రేక్ తీసుకోమని మేం చెబుతుంటాం. కానీ ఈ దొంగలు మా స్లోగన్‌ను మరీ సీరియస్‌గా తీసుకున్నారు. ఏకంగా 12 టన్నుల చాక్లెట్లతో బ్రేక్ తీసుకున్నారు’ అని పేర్కొంది. మార్చి 26న చాక్లెట్ల లోడుతో ఇటలీ నుంచి పోలండ్ వెళ్తున్న ట్రక్కు మార్గమధ్యంలో మాయమైపోయింది. ఇప్పటికీ దాని ఆచూకీ తెలియరాలేదని నెస్లే తెలిపింది.
News March 30, 2026
నామినేషన్ వేసిన CM స్టాలిన్, విజయ్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇవాళ కొలత్తూరు నుంచి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నామినేషన్ దాఖలు చేశారు. అటు తమిళగ వెట్రి కళగం(TVK) అధినేత, నటుడు విజయ్ దళపతి కూడా పెరంబూరు నియోజకవర్గానికి సంబంధించి చెన్నైలో నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.


