News March 26, 2025
రోబోటిక్ పద్ధతిలో కిడ్నీ మార్పిడి..సౌత్‌లో ఫస్ట్ టైమ్

TG: నిమ్స్ ఆసుపత్రిలో 33ఏళ్ల యువకుడికి రోబోటిక్ పద్ధతిలో కిడ్నీ మార్పిడి చేశారు. దీంతో దక్షిణాదిలో రోబోటిక్ విధానంలో ఆపరేషన్ చేసిన తొలి ప్రభుత్వ ఆసుపత్రిగా నిమ్స్ ఘనత సాధించింది. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి కిడ్నీ సేకరించిన డాక్టర్లు ఆ యువకుడికి విజయవంతంగా అమర్చారు. నిమ్స్‌లో ఇప్పటివరకూ 2వేల కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్స్ పూర్తిచేసినట్లు డాక్టర్లు తెలిపారు.
Similar News
News November 20, 2025
NSIC లిమిటెడ్‌లో ఉద్యోగాలు

నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్(NSIC) 5పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 3 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీఈ, బీటెక్, CA/CMA,MBA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంజినీర్ పోస్టులకు గరిష్ఠ వయసు 31ఏళ్లు కాగా.. మేనేజర్‌కు 40 ఏళ్లు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://nsic.co.in/
News November 20, 2025
చేనేత కార్మికుల రుణమాఫీకి రూ.33 కోట్లు విడుదల

TG: రాష్ట్రంలో చేనేత కార్మికులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రుణమాఫీ కోసం రూ.33 కోట్లు నిధులు రిలీజ్ చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. చేనేత కార్మికుల అప్పులు తీర్చేందుకు వీటిని వినియోగించనున్నారు. నిధుల విడుదలపై చేనేత కార్మికులు ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు.
News November 20, 2025
ఏపీకి మళ్లీ వర్ష సూచన

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడే అవకాశముందని.. తర్వాతి 48 గంటల్లో ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదిలి వాయుగుండంగా బలపడే ఛాన్సుందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో నేటి నుంచి ఆదివారం వరకు ప్రకాశం, NLR, CTR, TPT, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. మంగళవారం కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.


