News September 16, 2024
పిల్లలు స్కూల్‌కు వెళ్లనంటున్నారా? ఇలా చేయండి

* పిల్లల్ని మీరే స్కూల్‌కు, ఇంటికి తీసుకువెళ్లాలి.
* నచ్చిన స్నాక్స్‌ను లంచ్ బాక్స్‌లో పెట్టాలి. గిఫ్ట్స్ ఇవ్వాలి.
* తిడుతూ, కొడుతూ పంపవద్దు. ఇలా చేస్తే మరింత భయపడతారు.
* ఎందుకు వెళ్లనంటున్నారో కారణం అడగాలి. టీచర్లకు భయపడితే ఓసారి టీచర్లతో మాట్లాడి ఆ భయాన్ని పోగొట్టాలి.
* తెలిసిన/పక్కింటి వారు వెళ్తున్న స్కూళ్లలో చేర్పించాలి. ఫ్రెండ్స్ ఉంటే స్కూల్‌కు వెళ్లాలనే ఆసక్తి పెరుగుతుంది.
Similar News
News November 10, 2025
హజ్ యాత్రపై సౌదీతో ఒప్పందం.. భారత్ కోటా ఎంతంటే..

హజ్ యాత్రకు సంబంధించి భారత్, సౌదీ అరేబియా మధ్య ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది. 2026 సంవత్సరానికి గాను భారత్ కోటా కింద 1,75,025 మంది యాత్రికులకు అనుమతివ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు జెడ్డాలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, సౌదీ మంత్రి తౌఫిక్ అగ్రిమెంట్‌పై సంతకాలు చేశారు. హజ్ ఏర్పాట్ల గురించి వీరిద్దరూ సమీక్షించారు. కోఆర్డినేషన్, రవాణా మద్దతు, తీర్థయాత్ర సజావుగా సాగడం వంటి అంశాలపై చర్చించారు.
News November 10, 2025
నేటి నుంచి గ్రూప్ -3 పోస్టులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్

తెలంగాణలో నేటి నుంచి గ్రూప్-3 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టనున్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో ఈ నెల 26వరకు నిర్వహించనున్నారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30గంటల వరకు నిర్వహిస్తారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు 2 జిరాక్స్ సెట్లు తీసుకెళ్లాలి.
News November 10, 2025
600 ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్(RITES) 600 సీనియర్ అసిస్టెంట్ కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. BSc, డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం గలవారు NOV 12వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.300, SC, ST, PwBDలకు రూ.100. వెబ్సైట్: www.rites.com/Career. మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.


