News December 25, 2024
ఆరుగురిని పెళ్లాడిన కిలేడీ.. చివరకు..!
ఢిల్లీకి చెందిన ఓ యువతి ఆరు పెళ్లిళ్లు చేసుకుని.. ఏడోదానికి సిద్ధమవుతుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. పూనమ్ పెళ్లి కుమార్తెగా, సంజన ఆమె తల్లిగా నటిస్తూ ఒంటరిగా ఉండే పురుషులను టార్గెట్ చేస్తారు. ఇలా పూనమ్ ఆరుమందిని పెళ్లాడింది. పెళ్లైన వెంటనే ఇంట్లోని బంగారం, నగదుతో ఉడాయిస్తారు. UPకి చెందిన శంకర్ ఉపాధ్యాయ్‌ను కూడా వీరు మోసం చేయాలని చూడగా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.
Similar News
News December 26, 2024
సూపర్ ఏజ్డ్ ద.కొరియా.. 20 శాతం వృద్ధులే
సంతానోత్పత్తి భారీగా తగ్గిపోవడంతో దక్షిణ కొరియా జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆ దేశ మొత్తం జనాభా 5.1 కోట్లుకాగా 65 ఏళ్లు పైబడిన వారు 1.24 కోట్ల మంది(20%) ఉన్నారు. అంటే ప్రతి ఐదుగురిలో ఒకరు వృద్ధులే. ఈ క్రమంలోనే ద.కొరియా ‘సూపర్ ఏజ్డ్ సొసైటీ’గా మారింది. ఐరాస ప్రకారం 7% కంటే ఎక్కువ వృద్ధ జనాభా ఉంటే ఏజింగ్ సొసైటీ, 14% పైన ఉంటే ఏజ్డ్ సొసైటీ, 20% కంటే ఎక్కువ ఉంటే సూపర్ ఏజ్డ్ సొసైటీగా పేర్కొంటారు.
News December 26, 2024
ఏ వయసులో తండ్రి కావాలంటే?
ప్రస్తుత ఉరుకుల పరుగుల ప్రపంచంలో కొందరు పెళ్లైనా పిల్లల గురించి ఆలోచించడం లేదు. కానీ 22 నుంచి 30 ఏళ్ల మధ్యలోనే తండ్రి కావడం ఉత్తమమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వయసులో టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయి అత్యధికంగా ఉంటుంది. స్పెర్మ్ చురుకుగా, అధిక నాణ్యతతో ఉంటుంది. 30 ఏళ్లు దాటితే వీర్యంలో నాణ్యత తగ్గి గర్భస్రావం కావచ్చు. 35 ఏళ్ల తర్వాత తండ్రి అయినా పుట్టే బిడ్డ లోపాలతో జన్మించవచ్చు.
News December 26, 2024
English Learning: Antonyms
✒ Defile× Purify, sanctity
✒ Demolish× Repair, construct
✒ Deliberate× Rash, Sudden
✒ Deride× Inspire, Encourage
✒ Deprive× Restore, Renew
✒ Dissuade× Insite, Persuade
✒ Disdain× Approve, praise
✒ Dense× Sparse, brainy
✒ Denounce× Defend