News August 31, 2024

క్యాన్సర్‌కు ఉప‌క‌రించే ప్రోటీన్‌పై కిల్లర్ సెల్స్ దాడి

image

మ‌నిషి రోగనిరోధక వ్యవస్థలోని నేచురల్ కిల్లర్ సెల్స్‌ క్యాన్సర్‌కు ఉప‌క‌రించే XPO1 అనే ప్రోటీన్‌ను గుర్తించి దాడి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నట్టు శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. కిల్ల‌ర్ సెల్స్ ఈ ప్రోటీన్‌ను త‌మ అధీనంలోకి తీసుకొని మ‌రిన్ని కిల్ల‌ర్ సెల్స్‌ను ఏర్పాటు చేసుకొని దాడి చేస్తున్న‌ట్టు వెల్ల‌డించారు. తద్వారా నూత‌న‌ చికిత్సా విధానాలపై సౌతాంప్టన్ వర్సిటీ శాస్త్రవేత్తలు ఆశాభావంగా ఉన్నారు.

Similar News

News October 17, 2025

23న క్యాబినెట్ భేటీ.. బీసీ రిజర్వేషన్లపై ప్రకటన?

image

TG: BC రిజర్వేషన్లపై నిన్న సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో క్యాబినెట్ భేటీలో కీలక ప్రతిపాదన చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ పరంగానే BCలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక ఎన్నికలకు వెళ్లాలని మెజార్టీ మంత్రులు సీఎం రేవంత్‌కు సూచించినట్లు సమాచారం. దీనిపై ఈనెల 19న TPCC పీఏసీ భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. అనంతరం 23న క్యాబినెట్ మరోసారి సమావేశమై అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది.

News October 17, 2025

తడిలో చేతిపై ముడతలు.. ఇందుకేనట!

image

నీటిలో కొద్దిసేపు ఉండగానే చేతులు, పాదాలపై ముడతలు ఏర్పడటం చూస్తుంటాం. ఈ ప్రక్రియను ఓస్మోటిక్ వ్యాప్తి అంటారని శాస్త్రవేత్తలు తెలిపారు. నీటిలో ఉన్న వస్తువులను పట్టుకోవడానికి ఇవి సహాయపడతాయని చెబుతున్నారు. ‘శరీరంలోని అటానమిక్ నెర్వస్ సిస్టమ్ రక్త నాళాలను సంకోచింపజేయడం ద్వారా ముడతలు ఏర్పరుస్తుంది. ఆదిమానవులు తడి వాతావరణంలో ఆహారం సేకరించేందుకు ఇవి ఉపయోగపడేవి’ అని అభిప్రాయపడ్డారు.

News October 17, 2025

509 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు.. అప్లై చేశారా?

image

ఢిల్లీ పోలీస్ విభాగంలో 509 హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టులకు అప్లై చేయడానికి ఇంకా 3 రోజులే (OCT 20) సమయం ఉంది. ఇంటర్ అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పురుషులకు 341, మహిళలకు 168 జాబ్‌లు ఉన్నాయి. వయసు 18- 25 ఏళ్ల మధ్య ఉండాలి. రాతపరీక్ష, PE&MT, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.