News October 16, 2024
కెనడాలో ఖలిస్థానీ టెర్రరిస్టులను చంపిస్తోంది అమిత్ షానే: WP కథనం

తమ దేశంలో ఖలిస్థానీ నేతలపై దాడులకు వ్యూహరచన చేసింది సీనియర్ RAW అధికారి, హోంమంత్రి అమిత్ షా అని కెనడా అధికారులు NSA అజిత్ దోవల్‌కు సమాచారం ఇచ్చినట్టు వాషింగ్టన్ పోస్టు ఓ కథనం ప్రచురించింది. ‘భారత్‌లో ఓ సీనియర్ లీడర్, ఓ సీనియర్ RAW అధికారి’ అని కెనడా అధికారులు రిఫరెన్స్ ఇచ్చారని పేర్కొంది. ఆ సీనియర్ లీడర్ అమిత్ షానే అని వారు గుర్తించినట్టు తెలిపింది. Indian Govt దీనిపై తమకు వివరణ ఇవ్వలేదంది.
Similar News
News December 6, 2025
మీ పిల్లలు చేసే ఈ పనులను సరిదిద్దండి

పిల్లలు చేసే కొన్ని పనులు మనకు నవ్వు తెప్పిస్తాయి. కానీ అవే భవిష్యత్‌లో సమస్యలుగా మారే ప్రమాదముంది. పెద్దలు మాట్లాడేటప్పుడు అడ్డుకోవడం, ఏదైనా షేర్ చేసుకోకుండా మొండిగా ఉండటం, అబద్ధాలు చెప్పడం, దుకాణాల్లో మారాం చేయడం.. ఇవన్నీ చిన్న వయసులోనే మార్చాల్సిన అలవాట్లు. ఎక్కువ సమయం ఫోన్ చూడటం, మాట వినకపోవడం వంటి ప్రవర్తనలు కూడా వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతాయి. మృదువైన హెచ్చరికతో పిల్లలను సరిదిద్దాలి.
News December 6, 2025
ECIL హైదరాబాద్‌లో ఉద్యోగాలు

హైదరాబాద్‌లోని<
News December 6, 2025
నాణ్యమైన బొగ్గురాక విద్యుదుత్పత్తిలో సమస్య

TG: నాణ్యమైన బొగ్గురాక డిమాండ్‌కు తగ్గ విద్యుదుత్పత్తిలో జెన్కో సమస్య ఎదుర్కొంటోంది. నాసిరకం బొగ్గువల్ల థర్మల్ ప్లాంట్ల యంత్రాలూ దెబ్బతింటున్నాయి. ఇది సరఫరాపై ప్రభావం చూపి బయటి నుంచి అధిక ధరకు కొనే పరిస్థిితి వస్తోంది. దీంతో క్వాలిటీ కోల్ కోసం సింగరేణికి లేఖ రాసింది. బకాయిపడ్డ ₹15000 CR అంశాన్నీ పరిష్కరించింది. క్వాలిటీ బొగ్గు సరఫరాకు అంగీకారం కుదుర్చుకుంది. ఇక నిర్ణీత 4200mw ఉత్పత్తి చేయనుంది.


