News September 23, 2024

ఇద్దరు మహిళల్ని ఉరి తీయించిన కిమ్ జాంగ్

image

ఉత్తర కొరియాలో పరిస్థితుల గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. తాజాగా ఇద్దరు మహిళల్ని ఆ దేశాధినేత కిమ్ జాంగ్ ఉరి తీయించారు. వారిద్దరూ చైనాలో నివాసం ఉంటున్నారు. ఉత్తర కొరియా నుంచి దక్షిణ కొరియా పారిపోవాలనుకున్న వారికి ఆ ఇద్దరూ సాయం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో వారిని కిమ్ స్వదేశానికి రప్పించి, విచారణ చేయించి ఉరి శిక్ష అమలు చేయించారు. ఇలాంటి ఆరోపణలే ఉన్న మరో 9మందికి జీవిత ఖైదు విధించారు.

Similar News

News September 23, 2024

ఆపరేషన్ బుడమేరు.. 270 ఎకరాల్లో ఆక్రమణల గుర్తింపు

image

AP: విజయవాడలో ఆపరేషన్ బుడమేరును చేపట్టేందుకు అధికారులు ముమ్మరంగా అడుగులు వేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ఆక్రమణల వివరాలు సేకరిస్తున్నారు. ఎ.కొండూరు నుంచి విజయవాడ వరకు 40 గ్రామాల పరిధిలో 2,700 ఎకరాల్లో బుడమేరు ప్రవహిస్తోంది. ఇందులో 270 ఎకరాల మేర ఆక్రమణలకు గురైనట్లు కలెక్టర్ సృజన తెలిపారు. 3వేల గృహాలు, 80 నిర్మాణాలను గుర్తించామన్నారు. ఎవరికీ ఇబ్బందులు కలగకుండా ఆపరేషన్ చేపడతామన్నారు.

News September 23, 2024

రేషన్ కార్డులు ఉన్న వారికి శుభవార్త

image

TG: అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం, మరో తీపికబురు అందించింది. రేషన్ కార్డు ఉన్న వారు రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా సరకులు తీసుకోవచ్చని CLP సమావేశంలో CM రేవంత్ ప్రకటించారు. త్వరలోనే ఫ్యామిలీ డిజిటల్ కార్డు తీసుకొస్తున్నామని, ప్రతి ఒక్కరికీ హెల్త్ ప్రొఫైల్ డిజిటల్ కార్డు అందిస్తామన్నారు. ఇన్‌ఛార్జి మంత్రులు వారంలో రెండుసార్లు జిల్లాల్లో పర్యటించాలని సీఎం సూచించారు.

News September 23, 2024

కామ్రేడ్ దిసనాయకేకు CPI(M) అభినందనలు

image

శ్రీలంక అధ్యక్షునిగా ఎన్నికైన మార్క్సిస్ట్ నేత అనురకుమార దిసనాయకేకు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా(మార్క్సిస్ట్) అభినందనలు తెలిపింది. శ్రీలంక చరిత్రలో తొలిసారి ఓ కమ్యూనిస్ట్ నేత అధ్యక్ష పీఠంపై కూర్చోనున్న ఈ సందర్భం ఎంతో మహత్తరమైనదని పేర్కొంది. శ్రీలంకను దిసనాయకే ప్రగతి పథంలో నడిపిస్తారనే విశ్వాసం తమకు ఉందని చెప్పింది.