News December 5, 2024
కిమ్ జోంగ్ ఉన్‌లా చంద్రబాబు ధోరణి: VSR

AP: CM చంద్రబాబు ధోరణి ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్‌లా ఉందని YCP MP విజయసాయిరెడ్డి మండిపడ్డారు. CM నియంతృత్వ ధోరణితో YCP నేతలు, కార్యకర్తలను వేధిస్తున్నారని ట్వీట్ చేశారు. ‘చంద్రబాబు ప్రభుత్వం అణచివేత చర్యలు ఆయన పిరికితనానికి నిదర్శనం. ఆయన రాజకీయ ప్రతీకారానికి ఎలాంటి జస్టిఫికేషన్ లేదు. ప్రజలు జీవించే హక్కు కోల్పోయి అధికార పార్టీ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి బతుకుతున్నారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.
Similar News
News January 20, 2026
LRS.. 4 రోజులే గడువు

AP: అనుమతి లేని ప్లాట్ల క్రమబద్ధీకరణకు 4 రోజులే అవకాశం ఉంది. LRSకు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం ఈ నెల 23 వరకు గడువు విధించింది. రాష్ట్రంలో 9 వేల ఎకరాల మేర అనధికార లేఅవుట్లు ఉన్నట్లు అధికారుల అంచనా. ఇప్పటిదాకా 6 వేల ఎకరాల్లోని ప్లాట్ల రెగ్యులరైజేషన్ కోసం 52 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. మరో 25 వేల అప్లికేషన్లు రావొచ్చని తెలుస్తోంది. కాగా గడువు పొడిగించాలని ప్రజల నుంచి వినతులు వస్తున్నాయి.
News January 20, 2026
BJP కొత్త బాస్‌కు అగ్నిపరీక్షగా 5 రాష్ట్రాల ఎన్నికలు!

BJP నూతన అధ్యక్షుడు నితిన్ నబీన్‌కు ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు పరీక్షగా మారనున్నాయి. WB, కేరళ, TN, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలను విజయవంతంగా ఎదుర్కోవడం ఆయన ముందున్న సవాల్. ముఖ్యంగా షా, నడ్డా హయాంలో పార్టీ సాధించిన విజయాల పరంపరను నిలబెట్టడం నబీన్‌కు అగ్నిపరీక్షే. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడం, బెంగాల్‌లో అధికారం దిశగా అడుగులు వేయడంపైనే ఆయన భవిష్యత్తు ఆధారపడి ఉంది!
News January 20, 2026
ఇన్‌స్ట్రుమెంటేషన్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ పోస్టులు

<


