News November 15, 2024
కిమ్ జోంగ్ ఉన్ సంచలన నిర్ణయం
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆత్మాహుతి డ్రోన్లను భారీ సంఖ్యలో తయారు చేయాలని ఆయన ఆదేశించినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఉత్తర కొరియా ఈ ఏడాది ఆగస్టులో తొలిసారి ఆత్మాహుతి డ్రోన్లను పరీక్షించింది. ఇవి భూమితో పాటు సముద్ర జలాల్లో వివిధ రేంజ్‌లలో ఉన్న శత్రువులను సైతం ఛేదించగలవు. వీటిని ఇప్పటికే ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్ యుద్ధాల్లో ఉపయోగించారు.
Similar News
News November 15, 2024
జగన్ ఒక్క ఛాన్స్ అని నాశనం చేశారు: సీఎం
AP: జగన్ 2019లో ఒక్క ఛాన్స్ అని వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేశారని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో విమర్శించారు. తాము ఊహించిన దాని కంటే ఎక్కువ విధ్వంసం చేశారని, జీవోలు కూడా ఆన్‌లైన్‌లో ఉంచలేదన్నారు. జగన్ చీకటి పాలనలో రాష్ట్రంలో 30 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని తెలిపారు. భూమి ఉంది కాబట్టే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, అందుకే అమరావతి కోసం భారీగా భూమి కావాలనుకున్నామని వివరించారు.
News November 15, 2024
మైనర్ భార్యతో శృంగారం అత్యాచారమే: బాంబే హైకోర్టు
అంగీకారంతో మైనర్ భార్య(18 ఏళ్లలోపు)తో భర్త శృంగారంలో పాల్గొన్నా అత్యాచారమేనని బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది. అతనికి చట్టపరమైన రక్షణ ఉండదని స్పష్టం చేసింది. నిందితునికి కింది కోర్టు విధించిన 10ఏళ్ల జైలు శిక్షను సమర్థించింది. MH వార్ధాలో ఓ వ్యక్తి మైనర్‌తో లైంగిక సంబంధం పెట్టుకుని పెళ్లిచేసుకున్నాడు. తర్వాత విభేదాలు రావడంతో ఆమె రేప్ కేసు పెట్టింది. ఈ కేసు సమర్థనీయమేనని కోర్టు అభిప్రాయపడింది.
News November 15, 2024
ధాన్యం సేకరించిన వారంలోపే బోనస్: మంత్రి
TG: సన్న రకాల ధాన్యం పండించిన రైతులకు ₹500 బోనస్ కచ్చితంగా ఇస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ధాన్యం సేకరించిన వారంలోపే చెల్లిస్తామన్నారు. సబ్ కమిటీ నివేదిక రాగానే రైతు భరోసా కూడా ఇస్తామని ప్రెస్‌మీట్‌లో తెలిపారు. హరీశ్ రావు, KTR రైతులను రెచ్చగొడుతున్నారని, రైతుల కష్టాలపై మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. రైతులు పండించిన ప్రతి పంటను కొనుగోలు చేస్తామని మంత్రి తుమ్మల తెలిపారు.