News October 28, 2024

చైనాలో మూతపడుతున్న కిండర్‌గార్టెన్‌ స్కూళ్లు!

image

ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనా నేడు జనాభా తగ్గుదలతో ఇక్కట్లు పడుతోంది. అక్కడ జననాల సంఖ్య భారీగా తగ్గిపోయి, వృద్ధుల సంఖ్య పెరుగుదల పెరిగింది. ఈ క్రమంలో పిల్లలు లేక LKG, UKG పాఠశాలలు వేల సంఖ్యలో మూత పడుతున్నాయి. ఒకప్పుడు పిల్లలు వద్దంటూ నియంత్రించిన సర్కారే నేడు కనమని వేడుకుంటున్నా.. ఆర్థిక ఇబ్బందుల్ని తట్టుకోలేక చైనీయులు పిల్లల్ని కనడం లేదు.

Similar News

News October 28, 2024

10 మంది స్పెషల్ పోలీసుల డిస్మిస్

image

TG: పలు డిమాండ్లు నెరవేర్చాలని ఆందోళనలు చేస్తోన్న తెలంగాణ స్పెషల్ పోలీస్(TGSP) సిబ్బందిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. శనివారం 39 మందిని <<14463743>>సస్పెండ్<<>> చేసిన అధికారులు వారిలో 10 మందిని డిస్మిస్ చేశారు. ఈ మేరకు ఏడీజీ సంజయ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఒకే రాష్ట్రం- ఒకే పోలీస్ విధానం అమలు చేయాలంటూ కానిస్టేబుళ్లు, వారి భార్యలు రోడ్డెక్కి ధర్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే.

News October 28, 2024

బాడీ గార్డ్ లైంగికంగా వేధించాడు: అవికా గోర్

image

బాడీ గార్డే తనను లైంగికంగా వేధించాడని నటి అవికా గోర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘గతంలో నేను ఓ బాడీగార్డును నియమించుకున్నా. ఎవరూ నన్ను తాకకుండా చూడాల్సిన అతడే ఓ ఈవెంట్లో అసభ్యంగా తాకాడు. నేను సీరియస్ కాగా వెంటనే సారీ చెప్పాడు. కానీ మరోసారి కూడా అలాగే ప్రవర్తించాడు. అప్పుడు ధైర్యం లేక కొట్టలేదు. ఇప్పుడు మాత్రం ధైర్యం ఉంది. ఎవరైనా అలా బిహేవ్ చేస్తే కచ్చితంగా కొడతా’ అని తెలిపారు.

News October 28, 2024

JDUలోకి రీఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్ తండ్రి

image

క్రికెటర్ ఇషాన్ కిషన్ తండ్రి ప్రణవ్ కుమార్ పాండే రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. బిహార్‌లో అధికార పార్టీ జేడీయూలో చేరారు. ఆ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా సమక్షంలో కండువా కప్పుకున్నారు. సీఎం నితీశ్ కుమార్ తనకు ఆదర్శమని, పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని ఆయన చెప్పారు. కాగా గతంలో ఆయన ఇదే పార్టీలోనే ఉండేవారు. అయితే కొడుకును క్రికెటర్‌గా తీర్చిదిద్దడం కోసం రాజకీయాలకు బ్రేక్ ఇచ్చారు.