News November 27, 2024

మరోసారి కెప్టెన్‌గా ‘కింగ్’?

image

విరాట్ కోహ్లీ మరోసారి ఆర్సీబీ సారథ్య బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ వంటి ప్లేయర్లను వదులుకున్న బెంగళూరు కెప్టెన్సీని కింగ్‌కే ఇవ్వాలని యోచిస్తోందని సమాచారం. ప్రస్తుతం జట్టులోని ఆటగాళ్లలో నాయకత్వ బాధ్యతలు చేపట్టే ప్లేయర్లు ఎవరూ కనిపించట్లేదు. కాగా కోహ్లీ నాయకత్వంలో RCB 144 మ్యాచులు ఆడగా 68 విజయాలు, 72 పరాజయాలు పొందగా నాలుగింట్లో ఫలితం తేలలేదు.

Similar News

News November 28, 2025

వరంగల్: ప్రైవేట్ పీఏకు రూ.90 వేలు

image

కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో అక్రమాలు బయటకు వస్తున్నాయి. ఫెయిలైనవారికి మార్కులు కలపడంతో మొదలైన అవినీతి బండారం విజిలెన్సు విచారణలో విస్తుపోయేలా బయటకు వస్తున్నాయి. WGL విజిలెన్సు అధికారుల చేతిలో అవినీతి చిట్టా ఉన్నట్లు తెలిసింది. నోటిఫికేషన్ లేకుండా ప్రైవేట్‌గా ఉద్యోగులను పెట్టుకున్న విషయం బయటకు వచ్చింది. రూ.90 వేల వేతనంతో కాంట్రాక్టు పద్ధతిలో వీసీ పీఏను అంటూ చలామణి అవుతున్న వ్యక్తి బండారం బయటపడింది.

News November 28, 2025

మిరపలో మొవ్వుకుళ్లు తెగులు లక్షణాలు

image

మొవ్వుకుళ్లు తెగులు ఆశించిన మిరప మొక్కల చిగుర్లు ఎండిపోతాయి. కాండంపై నల్లని మచ్చలు ఏర్పడి క్రమేణా చారలుగా మారుతాయి. కొన్ని మొక్కల్లో ఆకులపై వలయాలుగా మచ్చలు ఏర్పడి పండుబారి రాలిపోతాయి. మొవ్వుకుళ్లు తెగులు ముఖ్యంగా తామర పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. బెట్టపరిస్థితులలో, అధిక నత్రజని మోతాదు వలన, తామర పురుగుల ఉద్ధృతి ఎక్కువవుతుంది. నీటి ద్వారా ఈ వైరస్ ఇతర మొక్కలకు వ్యాపిస్తుంది

News November 28, 2025

మిరపలో మొవ్వుకుళ్లు తెగులు నివారణ ఎలా?

image

మిరపలో మొవ్వుకుళ్లు తెగులుకు కారణమయ్యే తామర పురుగు నివారణకు లీటరు నీటికి ఫిప్రోనిల్ 2ml లేదా స్పైనోశాడ్ 0.25ml లేదా అసిటామిప్రిడ్ 0.2గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3mlలలో ఒక దానిని కలిపి పిచికారీ చేయాలి. గట్లమీద కలుపు మొక్కలు వైరస్‌లకు స్థావరాలు. వీటిని పీకి నాశనం చేయాలి. వైరస్ సోకిన మిరప మొక్కలను కాల్చివేయాలి. పొలం చుట్టూ 2 నుండి 3 వరుసల సజ్జ, జొన్న, మొక్కజొన్నను రక్షణ పంటలుగా వేసుకోవాలి.