News October 1, 2024
యార్కర్ల కింగ్ నయా రికార్డ్

టీమ్ ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మరో ఘనత సాధించారు. ఈ ఏడాదిలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఆయన అవతరించారు. ఆయన అన్ని ఫార్మాట్లలో కలిపి ఈ ఏడాది ఇప్పటివరకు 53 వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత హాంగ్‌కాంగ్ బౌలర్ ఎహ్సాన్ ఖాన్ (46), జోష్ హేజిల్‌వుడ్ (44), వనిందు హసరంగ (43), ఆడమ్ జంపా (41) ఉన్నారు.
Similar News
News December 31, 2025
గోదావరి నీటి మళ్లింపును అంగీకరించం: ఉత్తమ్

TG: AP ప్రణాళికలను అడ్డుకొని రాష్ట్ర నీటి వాటాను పరిరక్షించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ పేర్కొన్నారు. ‘గోదావరి నీళ్ల మళ్లింపును అంగీకరించం. ఏకపక్షంగా మళ్లించేందుకు ప్రయత్నిస్తే సహించే ప్రసక్తే లేదు. వారి నిర్ణయం CWC, GWDT తీర్పునకు భిన్నంగా ఉంది. అదనపు నీటి హక్కుల కోసం AP రూపొందించిన ప్రణాళికలకు వ్యతిరేకంగా ప్రభుత్వం న్యాయ పోరాటానికి పూనుకుంది. ప్రతిపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదు’ అని తెలిపారు.
News December 31, 2025
న్యూ ఇయర్ విషెస్.. ఈ మెసేజ్‌లతో జాగ్రత్త!

WhatsAppలో వచ్చే న్యూ ఇయర్ గ్రీటింగ్ కార్డులు, లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. .APK, .XAPK లింక్‌తో వచ్చే ఫొటోలు, వీడియోలపై క్లిక్ చేయవద్దని సూచిస్తున్నారు. వాటిలో మాల్వేర్ ఇన్స్టాల్ అయి ఉంటుందని, క్లిక్/డౌన్లోడ్ చేస్తే పర్సనల్/బ్యాంక్ అకౌంట్స్ డేటా చోరీ అయ్యే ఛాన్సుందని చెబుతున్నారు. ఇలాంటి మెసేజ్‌లు తెలిసిన నంబర్ల నుంచి వచ్చినా క్లిక్ చేయవద్దంటున్నారు.
News December 31, 2025
ఇంటికి 3 గడపలు ఉండకూడదా?

ఒకే గోడకి 3 గుమ్మాలు ఉండకూడదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం, భద్రతాపరంగానూ ఇది మంచిది కాదంటున్నారు. ‘అయితే ఇంటి లోపల ఒకదాని వెనుక మరొకటి.. అలా వరుసగా 3 ద్వారాలు ఉండవచ్చు. వాస్తు ఎప్పుడూ సరి సంఖ్యలో ద్వారాలకు ప్రాధాన్యమిస్తుంది. ఒకవేళ 3 గుమ్మాలు తప్పనిసరైతే, మూడో ద్వారం వేరే దిశలో ఏర్పాటు చేసుకుంటే వాస్తు దోషాన్ని నివారించవచ్చు’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>


