News April 13, 2025
ఓటీటీలోకి వచ్చేసిన ‘కింగ్స్టన్’

మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా తెరకెక్కిన అడ్వెంచర్ హారర్ థ్రిల్లర్ ‘కింగ్స్టన్’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు, తమిళ భాషల్లో జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రానికి కమల్ ప్రకాశ్ దర్శకత్వం వహించగా, దివ్యభారతి హీరోయిన్గా నటించారు. మార్చి 7న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైనా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
Similar News
News April 15, 2025
IPL: చెన్నై వరుస పరాజయాలకు బ్రేక్

CSK వరుస పరాజయాలకు(5) బ్రేక్ పడింది. లక్నోతో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 19.3 ఓవర్లలో ఛేదించింది. చివర్లో దూబే(43*), ధోనీ(26*) బౌండరీలతో మెరిపించి జట్టును విజయతీరాలకు చేర్చారు. త్రిపాఠి, జడేజా నిరాశపరిచినా రచిన్ రవీంద్ర(37), షేక్ రషీద్(27) రాణించారు. ఈ గెలుపుతో CSK ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉన్నాయి.
News April 15, 2025
మయన్మార్లో ఇంకా 1.25 లక్షల ట్రక్కుల శిథిలాలు!

మయన్మార్లో భూకంపం సృష్టించిన విధ్వంసం అంతాఇంతా కాదు. దాని వల్ల కూలిన భవనాల శిథిలాలు ఇంకా 1,25,000 ట్రక్కుల మేర మిగిలే ఉన్నాయని ఐక్యరాజ్యసమితి తాజాగా ప్రకటించింది. 10వేల ఇళ్లు ధ్వంసమయ్యాయని పేర్కొంది. మయన్మార్లోని మండాలయ్, సగైంగ్ లై నగరాల్లో రెండు వారాల క్రితం 7.7 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 3600మందికి పైగా మృతిచెందగా 60వేలమందికి పైగా నిరాశ్రయులైన సంగతి తెలిసిందే.
News April 15, 2025
మోదీపై ఉత్తరాఖండ్ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ ప్రశంసలు

వక్ఫ్ చట్ట సవరణను ఉత్తరాఖండ్ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ షాదాబ్ షామ్స్ స్వాగతించారు. పేద ముస్లింల బాధను పీఎం మోదీ అర్థం చేసుకున్నారని కొనియాడారు. దీంతో దశాబ్దాలుగా ధనిక, పలుకుబడి ఉన్న ముస్లింలు కబ్జా చేసిన వక్ఫ్ ఆస్తులకు మోక్షం కలుగుతుందన్నారు. ఆ ప్రాపర్టీస్ ఇక పేదలకు ఉపయోగకరంగా మారుతాయన్నారు. వక్ఫ్ చట్ట సవరణపై దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాలు నిరసన తెలుపుతున్న వేళ ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.