News February 9, 2025
పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కిరణ్ రాయల్‌కు ఆదేశం

AP: తిరుపతి జనసేన ఇన్‌ఛార్జ్‌పై <<15400758>>ఆరోపణలు వస్తున్న<<>> వేళ ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ ఆరోపణలపై క్షుణ్ణంగా విచారణ జరిపి నిర్ణయం తీసుకునే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కిరణ్ రాయల్‌ను ఆదేశించింది. జనసైనికులు, వీర మహిళలు ప్రజలకు ఉపయోగపడే విషయాలపై దృష్టి సారించాలని, సమాజానికి ప్రయోజనం లేని వ్యక్తిగత విషయాలను పక్కనపెట్టాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
Similar News
News December 26, 2025
ప్రతి పనికీ AI ఉపయోగిస్తున్నారా?

ప్రతి చిన్న పనికీ AI టూల్స్‌ను ఉపయోగించే అలవాటు పెరుగుతోంది. కానీ ఇది మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇటీవల కొంతమంది విద్యార్థులను మూడు విభాగాలుగా చేసి.. వారిని ChatGPT, Google Gemini సాయంతో పాటు సొంతంగా ఎస్సే రాయమన్నారు. AIని ఉపయోగించిన వారి ఆలోచనల్లో చురుకుదనం లేదని గుర్తించారు. అధికంగా AIపై ఆధారపడితే జ్ఞాపకశక్తి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
News December 26, 2025
స్వయంకృషి: ట్రెండ్ మారింది.. టైలర్ Boutique

లేడీస్ టైలర్ షాపులు ఇప్పుడు ట్రెండ్‌కు తగ్గట్టు స్కిల్స్, ఫీచర్స్ అప్డేట్ చేసుకుని బొటీక్స్‌గా మారుతున్నాయి. డిమాండ్ కూడా విపరీతంగా ఉంటోంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చే ఈ ఫ్యాషన్ స్టోర్‌కు టైమ్, స్కిల్, కొత్త డిజైన్లు చేయగల క్రియేటివిటీనే ప్రధాన ఖర్చు. మీకు తెలిసిన వారిని బొటీక్ గురించి అడిగి చూడండి. వారి వద్ద రేట్స్, డిమాండ్, చేసే పని మీకే అర్థమవుతుంది.
-రోజూ 1pmకు ఓ బిజినెస్ ఐడియా
News December 26, 2025
ఇండియన్ మ్యూజియంలో ఉద్యోగాలు

కోల్‌కతాలోని ఇండియన్ మ్యూజియంలో 3 యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. డిప్లొమా, డిగ్రీ( జర్నలిజం& మాస్ కమ్యూనికేషన్/ మీడియా సైన్స్/ఫైన్ ఆర్ట్స్/విజువల్ ఆర్ట్స్) అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు జనవరి 2 వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 4ఏళ్లు. జీతం నెలకు రూ.35వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://indianmuseumkolkata.org


