News March 21, 2025
IOC కొత్త ప్రెసిడెంట్‌గా కిర్స్టీ కోవెంట్రీ

ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ప్రెసిడెంట్‌గా జింబాబ్వే స్విమ్మర్, పొలిటీషియన్ కిర్స్టీ కోవెంట్రీ ఎన్నికయ్యారు. దీంతో IOC తొలి మహిళా అధ్యక్షురాలిగా ఆమె చరిత్ర సృష్టించారు. గ్రీస్‌లో జరిగిన 144వ IOC సెషన్‌లో కమిటీ మెంబర్స్ ఆమెను ఎన్నుకున్నారు. ఈ సెషన్‌లో పాల్గొన్న ఐసీసీ ఛైర్మన్ జైషా ఆమెకు విషెస్ తెలిపారు. లాస్ ఏంజెలిస్-2028 ఒలింపిక్స్ గేమ్స్ కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News January 30, 2026
‘జన నాయగన్’ ఎందుకు రిలీజ్ కాలేదో అందరికీ తెలుసు: విజయ్ తండ్రి

‘జన నాయగన్’ ఎందుకు విడుదల కాలేదో అందరికీ తెలుసని TVK అధ్యక్షుడు విజయ్ తండ్రి చంద్రశేఖర్ చెప్పారు. విజయ్ పొలిటికల్ ఎంట్రీ TNను 60ఏళ్లుగా పాలిస్తున్న ద్రవిడియన్ పార్టీలకు కునుకు లేకుండా చేస్తోందన్నారు. రాజకీయ కారణాలతోనే విడుదల ఆలస్యమవుతోందని చెప్పారు. ప్రస్తుత పాలకులు మీడియా స్వేచ్ఛను హరిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాలకు సినిమాలను వాడుకోవద్దన్నారు.
News January 30, 2026
ఈనేముందు చూడి పశువుల వసతి జాగ్రత్తలు

చూడి పశువును ఈనడానికి 15 రోజుల ముందు దూడ వేసే స్థలానికి మార్చాలి. నేలకు, మేతతొట్టెకు, పక్క గోడలకు సున్నం పూసి శుభ్రంగా ఉంచాలి. దీని వల్ల పశువులు ఈనే సమయంలో, మావి పడిపోయే సమయంలో గర్భాశయానికి రోగకారక క్రిములు చేరకుండా రక్షణ కలుగుతుంది. మేత తొట్టె నుంచి, మురుగు కాలువ వరకు నేల ఒక అంగుళం ఏటవాలుగా ఉండేట్టు చూసుకోవాలి. పశువులకు ఎండుగడ్డినే నేలపై పరిచి పరుపుగా వాడాలి. వరి పొట్టు, రంపం పొట్టు వాడొద్దు.
News January 30, 2026
హార్వర్డ్‌లో కోర్స్ పూర్తి చేసుకున్న CM రేవంత్

హార్వర్డ్ కెనడీ స్కూల్‌లో TG CM రేవంత్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కోర్స్ పూర్తయింది. ‘లీడర్‌షిప్ ఇన్ ది 21st సెంచరీ’ అనే ప్రోగ్రామ్‌ని JAN 25 నుంచి నిర్వహించారు. CM సహా 62 మంది విద్యార్థులు ఈ కోర్సు పూర్తి చేశారు. వారికి కెనడీ స్కూల్ ఫ్యాకల్టీ సర్టిఫికెట్స్ అందజేశారు. రోజూ ఉ.7 గంటల నుంచి సా.6 గంటల వరకు ఈ ప్రోగ్రామ్‌ని నిర్వహించారు.


