News June 17, 2024
జమ్మూకశ్మీర్ ఎన్నికల BJP ఇన్ఛార్జ్గా కిషన్ రెడ్డి

త్వరలో ఎన్నికలు జరగనున్న 4 రాష్ట్రాలకు బీజేపీ ఇన్ఛార్జ్లను నియమించింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి జమ్మూకశ్మీర్ బాధ్యతలు అప్పగించింది. ధర్మేంద్ర ప్రధాన్, బిప్లవ్ దేవ్-హరియాణా, అశ్వినీ వైష్ణవ్, భూపేంద్రయాదవ్-మహారాష్ట్ర, శివరాజ్ సింగ్ చౌహాన్, హిమంత బిస్వశర్మను ఝార్ఖండ్ ఇన్ఛార్జ్లుగా నియమిస్తున్నట్లు ప్రకటించింది.
Similar News
News September 3, 2025
రానున్న 2-3 గంటల్లో వర్షం

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 2-3గంటల్లో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఆదిలాబాద్, భూపాలపల్లి, జగిత్యాల, కరీంనగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన తేలికపాటి వర్షం పడుతుందని పేర్కొంది.
News September 3, 2025
యూరియా సమస్యను కేంద్ర మంత్రికి వివరించిన తుమ్మల

TG: రాష్ట్రంలో యూరియా సమస్య గురించి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్కు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. ‘టన్ను ఆయిల్ ఫామ్ గెలలకు రూ.25వేల మద్దతు ధరతో పాటు వాటిపై దిగుమతి సుంకాన్ని 44% పెంచాలి. వ్యవసాయ యంత్రాలు, మైక్రో ఇరిగేషన్ పరికరాలపై 12% GSTని మినహాయించాలి. పొటాషియం, సల్ఫర్ వంటి పోషకాలపై సబ్సిడీ పెంచి యూరియాతో సమాన ధరకు అందివ్వాలి’ అని ఢిల్లీ పర్యటనలో తుమ్మల కోరారు.
News September 3, 2025
అనుకోకుండా వేరొకరికి డబ్బు పంపారా?

పొరపాటున వేరొకరికి డబ్బులు పంపిస్తుంటాం. అలాంటి సమయంలో వేగంగా స్పందించి కంప్లైంట్ ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్యాంక్ కస్టమర్ కేర్కు కాల్ చేసి ట్రాన్సాక్షన్ ఐడీ, తేదీ, ఎమౌంట్ చెప్పాలి. అలాగే NPCI <