News January 8, 2025

గవర్నర్‌కు కిషన్ రెడ్డి ఫిర్యాదు

image

TG: హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంపై దాడి ఘటనపై గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మకు కిషన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. వందలాది కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయంపై కర్రలు, రాళ్లతో దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడిలో బీజేపీ నాయకులు గాయపడ్డారని, రాజకీయ ప్రత్యర్థులను అధికార పార్టీ భయభ్రాంతులకు గురిచేస్తోందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పాలన అందించేలా ప్రభుత్వానికి సూచించాలని కోరారు.

Similar News

News November 8, 2025

‘కీర్తి’ తెచ్చిన పనులు.. కింద పడేసిన మాటలు!

image

20వ శతాబ్దపు అతిగొప్ప శాస్త్రవేత్తల్లో ఒకరైన అమెరికన్ సైంటిస్ట్ జేమ్స్ వాట్సన్(97) నిన్న కన్నుమూశారు. DNAలోని ‘డబుల్ హెలిక్స్’ నిర్మాణాన్ని కనుగొన్నందుకు మరో ఇద్దరితో కలిసి 1962లో ఆయన నోబెల్ అందుకున్నారు. కానీ 2000 దశకంలో వాట్సన్ చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలు ఆయన ప్రతిష్ఠను దిగజార్చాయి. జీన్స్‌ కారణంగా నల్లజాతీయుల కంటే తెల్లజాతీయుల IQ లెవెల్స్ ఎక్కువని ఆయన వాదించడం వివాదానికి కారణమైంది.

News November 8, 2025

గాలి కాలుష్యం.. రెడ్ జోన్‌లోకి ఢిల్లీ

image

దేశ రాజధానిలో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇవాళ ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో AQI 400 పాయింట్లకు పైగా పడిపోవడంతో రెడ్ జోన్‌లోకి చేరింది. ఈ ఉదయం 10గంటలకు గరిష్ఠంగా 656పాయింట్లకు దిగజారింది. దీంతో అక్కడి ప్రభుత్వం ఎయిర్ ఎమర్జెన్సీ ప్రకటించింది. ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని సీఎం రేఖాగుప్తా సూచించారు. ప్రజా రవాణా ఉపయోగించాలని, కార్ పూలింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రజలను సీఎం కోరారు.

News November 8, 2025

రాత్రి బెడ్‌షీట్ కప్పి ఫోన్ స్క్రోల్ చేస్తున్నారా?

image

ఈమధ్య యువత పగలు రాత్రి తేడా లేకుండా ఫోన్‌లో రీల్స్ ఫ్లిప్ చేస్తూనే జీవితం గడుపుతోంది. చీకట్లో కళ్లకు దగ్గరగా పెట్టుకుని ఫోన్ చూస్తే నరాలు, మెదడుపై తీవ్ర ఒత్తిడి పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పైగా లైట్స్ ఆఫ్ చేశాక, బెడ్ షీట్ కప్పుకుని స్క్రీన్‌కు అతుక్కుపోయారంటే మన కళ్లపై బ్లూ లైట్ నేరుగా పడుతుంది. దీంతో నిద్రలేమి, కంటి చూపు సమస్యలు వస్తాయి. ఫోన్ వాడండి. వ్యసనంగా మార్చుకోకండి.
Share It