News May 4, 2024

సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్

image

TG: రాష్ట్రానికి యూపీఏ, ఎన్డీఏ ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా అంటూ సీఎం రేవంత్‌ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. 2004-14 మధ్య యూపీఏ, 2014-24 మధ్య ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన నిధులపై చర్చకు ఆహ్వానిస్తూ బహిరంగ లేఖ రాశారు. కొడంగల్‌లో లేదా అమరవీరుల స్తూపం దగ్గర చర్చకు రావాలన్నారు. పదేళ్లలో తెలంగాణకు కేంద్రం రూ.9లక్షల కోట్లు ఇచ్చిందని పేర్కొన్నారు.

Similar News

News March 13, 2026

వార్ ఎఫెక్ట్.. పెరిగిన ధరలు

image

పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దేశంలో వంట గ్యాస్‌తో పాటు వంట నూనెల ధరలకూ రెక్కలొచ్చాయి. వివిధ రకాల నూనెల రేట్లు గత వారంతో పోలిస్తే కేజీపై ₹1-4 వరకు పెరిగాయి. సన్ ఫ్లవర్ ఆయిల్ ₹4, పామ్ ఆయిల్ ₹2.50, గ్రౌండ్‌నట్ ఆయిల్ ₹2, సోయాబీన్, వనస్పతి ఆయిల్ ₹1 చొప్పున పెరిగాయి. దేశంలో ఉపయోగించే వెజిటబుల్ ఆయిల్స్‌లో దాదాపు 90 శాతం అంతర్జాతీయ మార్కెట్‌ నుంచి దిగుమతి చేసుకోవడమే ఇందుకు కారణం.

News March 13, 2026

సెలవు తేదీ మార్పు

image

AP: పవిత్ర రంజాన్ మాసంలో జరుపుకునే ‘షబే ఖద్ర్’ పండుగ సందర్భంగా ప్రకటించిన ఆప్షనల్ సెలవును ఈ నెల 15 నుంచి 17వ తేదీకి ప్రభుత్వం మార్చింది. ఈ మేరకు CS సాయి ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రంజాన్ మాసంలోని చివరి 10 రోజుల్లో, ముఖ్యంగా బేసి సంఖ్య రోజుల్లో ఈ పండుగ జరుపుకుంటారు. ఖురాన్ అవతరించిన రాత్రిగా దీన్ని భావిస్తారు.

News March 13, 2026

కొబ్బరి మొక్కల ఎంపిక – రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

కొబ్బరిలో అధిక దిగుబడి రావాలంటే మొక్కల ఎంపిక కీలకం. మొక్కల వయస్సు 10-12 నెలలు ఉన్న వాటిని ఎంపిక చేసుకోవాలి. ఆకుల సంఖ్య 6, అంతకంటే ఎక్కువ ఉండాలి. అలాగే మొక్క కాండం మొదలు చుట్టుకొలత పొట్టి రకానికి 8 సెం.మీ., పొడవు రకానికి 10 సెం.మీ. కంటే ఎక్కువ ఉండాలి. అలాగే మొక్క ఎత్తు పొట్టి రకాలకు 80 సెం.మీ. మరియు పొడవు, హైబ్రిడ్ మొక్కలకు 100 సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉండాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.