News March 25, 2024

కిషన్ రెడ్డిని ఈడీ విచారించాలి: జగదీశ్ రెడ్డి

image

TS: లిక్కర్ కేసులో ఆధారాలున్నాయని మంత్రి కిషన్ రెడ్డి అన్నారని, ఆయన్ను ఈడీ విచారించాలని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. అటు.. కాంగ్రెస్ మంత్రులు రైతుల్ని పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో కరవుతో లక్షలాది ఎకరాలు ఎండిపోతున్నాయి. కాళేశ్వరం నుంచి 100 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసే అవకాశం ఉన్నా ప్రభుత్వం చేయట్లేదు. ఉత్తమ్‌కు నీటిపై పరిజ్ఞానం లేదు’ అని ఆయన మండిపడ్డారు.

Similar News

News October 3, 2024

లడ్డూ వివాదంపై నేడు సుప్రీం విచారణ.. సర్వత్రా ఉత్కంఠ

image

AP: తిరుమల లడ్డూ వివాదంపై ఇవాళ సుప్రీంకోర్టు మరోసారి విచారించనుంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్‌ను కొనసాగించాలా?లేదా స్వతంత్ర సంస్థను నియమించాలా? అనే అంశంపై సొలిసిటర్ జనరల్ తుషార్ తన అభిప్రాయాన్ని ధర్మాసనానికి చెప్పనున్నారు. దీన్నిబట్టి న్యాయమూర్తులు తీర్పును వెలువరించనున్నారు. గత విచారణలో సీఎం చంద్రబాబుపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

News October 3, 2024

హెజ్బొల్లా చీఫ్ నస్రల్లా అల్లుడి హతం

image

హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా అల్లుడు హసన్ జాఫర్ అల్ ఖాసిర్ హతమైనట్లు ఐడీఎఫ్ తెలిపింది. సిరియా డమాస్కస్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌పై ఇజ్రాయెల్ దాడి చేయగా మరొకరితోపాటు ఖాసిర్ కూడా మరణించారు. మరోవైపు తాజాగా లెబనాన్‌లోని దహియేపై ఇజ్రాయెల్ మూడు క్షిపణులతో విరుచుకుపడింది. ఈ దాడిలో ఆరుగురు మృతిచెందారు. మరో ఏడుగురు తీవ్ర గాయాలపాలయ్యారు.

News October 3, 2024

భారత్‌లోనే ఖో ఖో తొలి వరల్డ్ కప్

image

మొట్టమొదటి ఖో ఖో వరల్డ్ కప్ వచ్చే ఏడాది భారత్‌లో జరగనుంది. ఇందులో 24 దేశాల నుంచి 16 పురుష, 16 మహిళల జట్లు పాల్గొననున్నాయి. ఖో ఖోకు భారత్ పుట్టినిల్లు అని, ఈ వరల్డ్ కప్ దాని ఔన్నత్యాన్ని, సంప్రదాయ వారసత్వాన్ని హైలైట్ చేస్తుందని ఖో ఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (KKFI) తెలిపింది. 2032 నాటికి ఖో ఖోను ఒలింపిక్ స్పోర్ట్‌గా చూడటం తమ కల అని, అందుకు ఈ ప్రపంచకప్ దోహదం చేస్తుందని పేర్కొంది.