News May 3, 2024
ఆట ముద్దు.. బెట్టింగ్ వద్దు!

గత కొన్ని రోజులుగా బెట్టింగ్‌తో అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటున్నవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. అదృష్టాన్ని గుడ్డిగా నమ్మడమే దీనిక్కారణం. కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లు.. లక్‌పై ఆధారపడి పందెం వేస్తే ఉన్న 4 చిల్లిగవ్వలూ పోవచ్చు. కుటుంబం రోడ్డున పడొచ్చు. వస్తాయో రావో తెలియని రూ. లక్ష కంటే కష్టపడి సంపాదించుకున్న రూ. 100 వందరెట్లు నయం. ఆటను ఆస్వాదిద్దాం. బెట్టింగ్‌ను నివారిద్దాం.
Similar News
News April 8, 2026
ప్రపంచ శాంతికి గొప్ప రోజు : ట్రంప్

ప్రపంచ శాంతికి ఇది గొప్ప రోజు అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఇరాన్ కూడా శాంతిని కోరుకుంటోందని చెప్పారు. ‘హార్ముజ్ జలసంధిలో రవాణాను పునరుద్ధరించేందుకు అమెరికా సాయం చేయనుంది. భారీగా డబ్బు సంపాదించుకోవచ్చు. ఇరాన్ పునర్నిర్మాణ ప్రక్రియను ప్రారంభించవచ్చు. అంతా సవ్యంగా జరిగేలా చూసుకునేందుకు మేం అక్కడే ఉంటాం. US మాదిరే మిడిల్ ఈస్ట్‌లోనూ స్వర్ణ యుగం వస్తుంది’ అని ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు.
News April 8, 2026
‘ధురంధర్-2’ సక్సెస్‌పై మౌనం వీడిన దీపిక

రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్-2’ బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తోంది. అయితే ఈ సినిమా గురించి రణ్‌వీర్ భార్య దీపికా పదుకొణె పోస్ట్ పెట్టలేదంటూ SMలో చర్చ మొదలైంది. దీనిపై ఆమె తన స్టైల్‌లో రియాక్ట్ అయ్యారు. ‘మీకంటే ముందే నేను సినిమా చూశా. SMలో పెట్టనంత మాత్రాన సపోర్ట్ చేయనట్లా?’ అని కౌంటర్ ఇచ్చారు. రణ్‌వీర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న ఆమె అనవసర విమర్శలకు ఇలా ఫుల్ స్టాప్ పెట్టారు.
News April 8, 2026
BREAKING: భారీగా పెరిగిన బంగారం ధర

ఇరాన్-అమెరికా యుద్ధం నిలిచిపోవడంతో బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర ఇవాళ రూ.3,980 పెరిగి రూ.1,53,820కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.3,650 ఎగబాకి రూ.1,41,000 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో కాస్త తేడాలుండొచ్చు.


