News November 23, 2024

పుష్ప-2 నుంచి ‘కిస్సిక్’ టీజర్.. ఎప్పుడంటే..

image

పుష్ప-2 నుంచి కిస్సిక్ సాంగ్ ఈ నెల 24న సాయంత్రం 7.02 గంటలకు విడుదల కానుంది. అంతకంటే ముందు మూవీ టీమ్ ఆడియన్స్‌కు సర్‌ప్రైజ్ ప్లాన్ చేసింది. రేపు ఉదయం 10.08 గంటలకు సాంగ్ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటలో అల్లు అర్జున్ సరసన శ్రీలీల డాన్స్ చేశారు.

Similar News

News October 22, 2025

2,570 పోస్టులకు షార్ట్ నోటిఫికేషన్

image

2,570 ఇంజినీరింగ్ పోస్టులకు RRB షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా, బీటెక్ అర్హతగల అభ్యర్థులు ఈనెల 31 నుంచి నవంబర్ 30 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 33ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష(CBT-1, CBT-2), సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఈ నెల 31న రిలీజ్ కానుంది. వెబ్‌సైట్: <>https://www.rrbapply.gov.in<<>>

News October 22, 2025

జూ.ఎన్టీఆర్ ఫొటోలు మార్ఫింగ్ చేసి..

image

TG: యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నేతలు హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిశారు. కొందరు ఎన్టీఆర్ ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించిన వివరాలు సమర్పించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా SMలో దుష్ప్రచారం చేసే వారిపై ఉక్కుపాదం మోపుతామని సీపీ స్పష్టం చేశారు.

News October 22, 2025

వరల్డ్ క్లాస్ లైబ్రరీ కోసం శోభా గ్రూప్ ₹100 కోట్ల విరాళం

image

AP: ప్రపంచ అత్యుత్తమ నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతున్నామని CM CBN పేర్కొన్నారు. దుబాయ్‌ పర్యటనలో ఆయనతో పలు సంస్థల ప్రతినిధులు భేటీ అయ్యారు. అమరావతిలో వరల్డ్ క్లాస్ లైబ్రరీకి ‘శోభా గ్రూప్’ ఛైర్మన్ మీనన్ ₹100 కోట్ల విరాళం ప్రకటించారు. రాజధాని నిర్మాణంలోనూ భాగస్వామ్యం కావాలని సీఎం ఆ సంస్థను కోరారు. అంతకు ముందు APలో పెట్టుబడులకు అవకాశాలపై భారత రాయబార కార్యాలయ ప్రతినిధులతో చర్చించారు.