News October 17, 2025
వంటింటి చిట్కాలు

* ఇడ్లీ, దోశకు బియ్యం నానబెట్టే ముందు కాస్త వేయించాలి. ఇలా చేస్తే ఇడ్లీ మెత్తగా, దోశలు కరకరలాడుతూ ఉంటాయి.
* బంగాళదుంపలతో కలిపి నిల్వ చేస్తే వెల్లుల్లి చాలా కాలం తాజాగా ఉంటాయి.
* అప్పడాలు, వడియాలు వేయించే ముందు కాసేపు ఎండలో పెడితే నూనె ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటాయి.
* అరటిపండ్లను ప్లాస్టిక్ డబ్బాలో వేసి, ఫ్రిజ్‌లో పెడితే నల్లగా మారవు.
<<-se>>#VantintiChitkalu<<>>
Similar News
News October 17, 2025
జపాన్ మాజీ ప్రధాని కన్నుమూత

జపాన్ మాజీ ప్రధాని టొమిచి మురయమా(101) అనారోగ్యంతో కన్నుమూశారు. ఫాదర్ ఆఫ్ జపాన్ పాలిటిక్స్‌గా పిలవబడే మురయమా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని సోషల్ డెమోక్రటిక్ పార్టీ వెల్లడించింది. ఆయన 1994 నుంచి 1996 వరకు ప్రధానిగా పనిచేశారు. వరల్డ్ వార్-2 సమయంలో ఆసియాలో జపాన్ చేసిన దారుణాలకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ క్షమాపణలు చెప్పడం అప్పట్లో సంచలనంగా మారింది.
News October 17, 2025
సీతాఫలం.. మహిళల ఆరోగ్యానికి వరం

సీతాఫలంలో విటమిన్లు A, C, B6, ఖనిజాలు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని మహిళలు తింటే గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి, చర్మ నిగారింపు, హిమోగ్లోబిన్ మెరుగుపడుతుంది. షుగర్, బీపీ, ఒత్తిడి కంట్రోల్ అవుతుంది. ఇందులోని కాపర్ గర్భిణుల్లో పిండం అభివృద్ధిలో సహాయపడుతుంది. వాంతులు, మూడ్ స్వింగ్స్ అదుపులో ఉంటాయి. ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.
#ShareIt
News October 17, 2025
ప్రధాని అపాయింట్‌మెంట్ ఇప్పించండి: భట్టి

TG: BC రిజర్వేషన్లను BJPనే అడ్డుకుంటోందని Dy.CM భట్టి విక్రమార్క మండిపడ్డారు. ‘దీనిపై అఖిల పక్షంతో PMను కలవాలనుకున్నాం. కానీ ప్రధాని అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. ఇప్పటికీ మేం సిద్ధంగా ఉన్నాం. రామ్‌చందర్‌రావు, BJP నేతలు ఇప్పిస్తే కలుస్తాం. రేపటి బంద్ BJPకి వ్యతిరేకంగానే జరుగుతుంది. రిజర్వేషన్లపై SC తీర్పుపై న్యాయనిపుణులతో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం’ అని భట్టి అన్నారు.