News October 30, 2025

వంటింటి చిట్కాలు

image

* బత్తాయి, నారింజ పండ్లను మైక్రోఓవెన్‌లో కొన్ని సెకన్ల పాటు ఉంచితే తొక్క సులభంగా వస్తుంది.
* కాకరకాయ కూరలో సోంపు గింజలు లేదా బెల్లం వేస్తే కూర చేదు తగ్గుతుంది.
* అరటిపండ్లను ప్లాస్టిక్ డబ్బాలో వేసి ఫ్రిజ్‌లో పెడితే నల్లగా మారవు.
* ఐస్ క్యూబ్స్ వేసిన నీళ్లలో ఉడికించిన బంగాళదుంపలు వేసి, తర్వాత తొక్కలు తీస్తే సులువుగా వస్తాయి.
* పోపు గింజలు వేయించి నిల్వ చేస్తే పాడవకుండా ఉంటాయి.

Similar News

News October 30, 2025

GST ఎత్తివేత.. హెల్త్ ఇన్సూరెన్స్‌కు డిమాండ్

image

లైఫ్&హెల్త్ ఇన్సూరెన్స్‌పై GSTని ఎత్తేయడంతో ఆయా పాలసీల కోసం డిమాండ్ 38% వరకు పెరిగిందని పాలసీబజార్ రిపోర్టు వెల్లడించింది. ‘₹15L-₹25L కవరేజీపై 45శాతం, ₹15L-₹25L ప్లాన్లపై 24 శాతం, ₹10L కంటే తక్కువ ప్లాన్లపై 18 శాతం మంది ఆసక్తి చూపుతున్నారు. మొత్తంగా సగటు హెల్త్ కవరేజ్ ₹13L నుంచి ₹18Lకు పెరిగింది. 61+ ఏళ్ల కేటగిరీలో ఇన్సూరెన్సులు 11.5 శాతం పెరిగాయి’ అని పేర్కొంది.

News October 30, 2025

కూతురు మృతి: అడుగడుగునా లంచం ఇవ్వలేక..

image

ఒక్కగానొక్క కూతురు(34) అనారోగ్యంతో చనిపోతే.. ఆ తర్వాత అడుగడుగునా లంచం ఇవ్వలేక ఆ తండ్రి కుంగిపోయారు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. BPCL మాజీ CFO శివకుమార్ కూతురు ఇటీవల మరణించారు. అయితే అంబులెన్స్ మొదలుకుని FIR, పోస్టుమార్టం రిపోర్టు, అంత్యక్రియలు, డెత్ సర్టిఫికెట్ వరకు లంచం ఇవ్వాల్సి వచ్చిందని అతను SMలో పోస్టు చేసి ఆ తర్వాత డిలీట్ చేశారు. సిస్టమ్‌లోని కరప్షన్‌పై నెటిజన్లు ఫైరవుతున్నారు.

News October 30, 2025

ఈ డివైజ్‌తో అందమైన పాదాలు మీ సొంతం

image

పాదాల సంరక్షణ కోసం వచ్చిందే ఈ ఎలక్ట్రిక్‌ కాలస్‌ రిమూవర్‌. ఈ మల్టీఫంక్షనల్‌ పెడిక్యూర్‌ కిట్‌‌లో డెడ్‌ స్కిన్‌ రిమూవల్‌ హెడ్‌తో పాటు, నెయిల్‌ బఫర్‌ హెడ్, పాలిషింగ్‌ హెడ్ వస్తాయి. దీనికి ముందువైపు పవర్‌ బటన్‌ ఉంటుంది. స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ డివైస్‌తో పెడిక్యూర్‌ చేసుకోవడం చాలా సులభం. ఇది మృతకణాలను తొలగించి పాదాలను మృదువుగా మార్చడమే కాకుండా బ్యాక్టీరియా పెరుగుదలనూ నిరోధిస్తుంది.