News October 5, 2025
వంటింటి చిట్కాలు

✍️ మటన్ మెత్తగా ఉడకాలంటే చిన్న కొబ్బరి ముక్కను పెంకుతో సహా వేయాలి. మాంసం కూరలో నీరు ఎక్కువైతే చెంచా కాన్‌ఫ్లవర్ కలిపి ఉడికిస్తే చిక్కబడి రుచిగా ఉంటుంది.
✍️ పూరీల పిండిలో 4 చెంచాల పెరుగువేసి బాగా కలిపితే పూరీలు నూనె తక్కువ పీల్చుకుంటాయి. అలాగే బంగారు రంగులో మెరుస్తూ పొంగుతాయి.
✍️ వాష్ బేసిన్‌లో రంధ్రాలు మూసుకుపోయినప్పుడు వేడి నీటిలో కాస్త ఉప్పు కలిపి పోస్తే శుభ్రమవుతుంది.
<<-se>>#VantintiChitkalu<<>>
Similar News
News October 5, 2025
మీకు తెలుసా? మహిళల్లోనే బలమైన ఇమ్యూన్ సిస్టమ్

పురుషుల కంటే మహిళల సగటు జీవిత కాలం ఎక్కువని అందరికీ తెలుసు. దీనికి మగాళ్ల శరీరంలో కంటే బలమైన రోగనిరోధక వ్యవస్థలు ఉండటమే కారణమని అధ్యయనాల్లో తేలింది. స్త్రీలలో ఉండే రెండు X క్రోమోజోములతోపాటు ఈస్ట్రోజెన్ హార్మోన్‌లు బ్యాక్టీరియా, వైరస్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. ఒకరికి జన్మనిచ్చి, సంరక్షించడంలో మహిళలదే కీలకపాత్ర కావడంతో కాలక్రమేణా వారిలో ఇమ్యూన్ సిస్టమ్ అభివృద్ధి చెందినట్లు అంచనా.
News October 5, 2025
రోహిత్ శర్మ 45-77 ట్వీట్ వైరల్

13 ఏళ్ల కిందట హిట్‌మ్యాన్ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం వైరలవుతోంది. నిన్న రోహిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ గిల్‌ను IND వన్డే సారథిగా నియమించిన విషయం తెలిసిందే. కాగా 45 శకం ముగిసిందని, 77 జర్నీ మొదలైనట్లు రోహిత్ 2012లో ట్వీట్ చేశారు. రోహిత్ జెర్సీ నంబర్ 45 కాగా, గిల్‌ది 77. అయితే ఆ సమయంలో రోహిత్ ఎందుకలా ట్వీట్ చేశారో తెలుసుకునేందుకు ఫ్యాన్స్ ఇంటర్నెట్‌లో తెగ సెర్చ్ చేస్తున్నారు.
News October 5, 2025
సామాజిక సేవకులుగా నాయీబ్రాహ్మణులు.. ఎలాగంటే?

నాయీబ్రాహ్మణులు ఒకప్పుడు గ్రామ గూఢచారులుగా పనిచేసేవారనే విషయం మీకు తెలుసా? వారికుండే విస్తృత పరిచయాలే దీనికి కారణం. క్షురక వృత్తి రీత్యా వీరు గ్రామంలోని ప్రతి ఒక్కరికీ పరిచయస్థులే. దీంతో వారి దుకాణాలు సామాజిక కేంద్రాలుగా పనిచేసేవి. అలా గ్రామంలో జరిగే ప్రతి విషయం వారికి తెలిసేది. అందుకే అప్పట్లో కొత్త వ్యక్తుల వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు వారిని ప్రాథమిక సమాచార వనరుగా పరిగణించేవారు.