News October 10, 2025

వంటింటి చిట్కాలు

image

* దొండకాయలు తరిగేటప్పుడు చేతులకు కొద్దిగా నిమ్మరసం రాసుకుంటే వాటి జిగురు చేతులకు అంటుకోకుండా ఉంటుంది.
* అరటికాయలు కోసిన తరువాత నల్లబడకుండా ఉండాలంటే వాటిని వేసే నీళ్ళలో నాలుగు చుక్కల వెనిగర్ కలపాలి.
* బియ్యం డబ్బాలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఉంచితే పురుగులు చేరవు.
* అరిసెలు వండేటప్పుడు పాకంలో బియ్యప్పిండి సరిపోకపోతే తగినంత గోధుమపిండి కలపండి. <<-se>>#VantintiChitkalu<<>>

Similar News

News October 10, 2025

నోబెల్ ప్రైజ్ ప్రతిష్ఠ కోల్పోయింది: పుతిన్

image

NOBEL పీస్ ప్రైజ్‌కు వెనిజులా విపక్ష నేత మరియా ఎంపికవడం తెలిసిందే. దీనిపై రష్యా ప్రెసిడెంట్ పుతిన్ స్పందించారు. ‘ట్రంప్ అన్నివిధాలా అర్హులు. మిడిల్ ఈస్ట్‌లో యుద్ధాన్ని ఆపి శాంతిని నెలకొల్పుతున్నారు. శాంతికోసం పనిచేయని పలువురికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. అది తన ప్రతిష్ఠను కోల్పోయింది’ అని వ్యాఖ్యానించారు. అటు ‘శాంతిపై నోబెల్‌వి మాటలే. ట్రంప్ చేసి చూపించారు. ప్రైజ్‌కు అర్హులు’ అని నెతన్యాహు అన్నారు.

News October 10, 2025

కరూర్ తొక్కిసలాట ఘటన.. సుప్రీం తీర్పు రిజర్వ్

image

కరూర్ తొక్కిసలాటపై SIT ఏర్పాటు చేయాలన్న హైకోర్టు ఆదేశాన్ని సవాలు చేస్తూ TVK దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. TN పోలీసు అధికారులతోనే SIT ఏర్పాటు చేయాలనే HC తీర్పును వ్యతిరేకించింది. ఆపై జడ్జిలు జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ అంజరియాతో కూడిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. కరూర్‌లో TVK విజయ్ సభలో తొక్కిసలాట జరిగి 41 మంది మృతిచెందిన విషయం తెలిసిందే.

News October 10, 2025

బిహార్‌లో రేపు NDA కూటమి సమావేశం

image

త్వరలో బిహార్‌లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో NDA కూటమి రేపు అక్కడ కీలక సమావేశం నిర్వహించనుంది. JDU, BJPతో పాటు కూటమిలోని ఇతర పార్టీల సీట్ల పంపకాలపై ఇందులో చర్చించనున్నారు. మొత్తం 243 సీట్లలో జేడీయూ, బీజేపీ 205 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఏయే స్థానాల్లో ఎవరెవరు బరిలో దిగాలనే అంశంపై రేపు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా తొలి విడత ఎన్నికలకు ఇవాళ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.