News January 13, 2025
నేటి నుంచి కైట్ ఫెస్టివల్

TG: నేటి నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో కైట్ ఫెస్టివల్ జరగనుంది. ఈ వేడుకలకు 16 దేశాల నుంచి 47 మంది కైట్ ప్లేయర్లు, 14 రాష్ట్రాల నుంచి కైట్ క్లబ్ సభ్యులు హాజరుకానున్నారు. దీంతో పాటు స్వీట్ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్వీట్లను, తెలంగాణ పిండి వంటలు ఇక్కడి స్టాళ్లలో ప్రదర్శిస్తారు. ఈ వేడుకలకు సంబంధించి మంత్రి జూపల్లి కృష్ణారావు పోస్టర్ను రిలీజ్ చేశారు.
Similar News
News January 31, 2026
అమ్మోరు/మశూచి వ్యాధిని కోళ్లలో ఇలా గుర్తించండి

మశూచి వ్యాధి సోకిన కోళ్ల ముక్కు, ముఖం, కంటి రెప్పలు, దవడల పైన బొబ్బలు వచ్చి ముక్కు నుంచి, కంటి నుంచి నీరు కారుతూ ఉంటుంది. ఇది తక్కువ వ్యవధిలో ఇతర కోళ్లకు వ్యాపిస్తుంది. దీని వల్ల కోళ్ల మరణాలు తక్కువే ఉన్నప్పటికీ.. సరిగా మేత, నీరు తీసుకోలేవు. గుడ్లు పెట్టడం ఆగిపోతుంది. ఈ వ్యాధికి చికిత్స లేదు. చర్మంపై కురుపుల్లో ఇతర సూక్ష్మక్రిములు చేరకుండా ఉండేందుకు పసుపు, వేపనూనె మిశ్రమాన్ని పూతగా పూయాలి.
News January 31, 2026
కోళ్లలో తెల్లపారుడు వ్యాధి లక్షణాలు – నివారణ

కోడి పిల్లల్లో సాల్మొనెల్లా పుల్లొరం బ్యాక్టీరియా వల్ల తెల్లపారుడు వ్యాధి కనిపిస్తుంది. ఈ వ్యాధి సోకిన కోడి పిల్లలు నలతగా ఉండి ముడుచుకుని కూర్చుంటాయి. రెట్ట నీళ్లగా తెలుపు లేదా లేత పసుపు పచ్చ రంగులో ఉంటుంది. ఈకలు రాలిపోయి, రెక్కలు వేలాడేస్తాయి. ఈ వ్యాధి నివారణకు సల్ఫా లేదా టెట్రాసైక్లిన్ ముందును చిటికెడు చొప్పున ఒక టీ గ్లాసు నీళ్లలో కలిపి రోజుకు రెండు సార్లు వెటర్నరీ నిపుణుల సూచన మేరకు ఇవ్వాలి.
News January 31, 2026
కాలంలో విత్తనాలు కలలోనైనా పోయాలి

వ్యవసాయంలో విత్తనాలు చల్లడానికి ఒక నిర్దిష్ట సమయం ఉంటుంది. అది దాటిపోతే ఎంత కష్టపడినా పంట పండదు. కాబట్టి ఏవైనా అడ్డంకులు వచ్చినా లేదా ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఆ పనిని అస్సలు విస్మరించకూడదు. అలాగే మన నిజ జీవితంలో కూడా మంచి అవకాశాలు వస్తుంటాయి. వాటిని మనం సకాలంలో అందిపుచ్చుకోవాలి. లేదంటే అవి చేయిదాటిపోయాక పశ్చాత్తాప పడాల్సి వస్తుందని ఈ సామెత తెలియజేస్తుంది.


