News September 13, 2024

కివీస్VSఅఫ్గాన్.. ఒక్క బాల్ పడకుండానే చరిత్ర!

image

నోయిడాలో న్యూజిలాండ్, అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య జరగాల్సిన ఏకైక టెస్ట్ మ్యాచ్ రద్దయింది. వర్షం కారణంగా 5 రోజుల్లో ఒక్క రోజూ ఆట సాగలేదు. దీంతో ఒక్క బాల్ కూడా పడకుండానే రద్దయిన మ్యాచ్‌గా ఇది రికార్డులకెక్కింది. ఇలా జరగడం గత 26 ఏళ్లలో ఇదే తొలిసారి అని క్రీడా వర్గాలు తెలిపాయి. చివరిగా 1998లో న్యూజిలాండ్, భారత్ మ్యాచ్ ఒక్క బాల్ పడకుండానే రద్దయింది.

Similar News

News November 14, 2025

కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>కెనరా<<>> బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ 10 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు. డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులై, NISM/NCFM సర్టిఫికెట్‌తో పాటు పని అనుభవం గలవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.canmoney.in/careers

News November 14, 2025

తగ్గిన బంగారం ధరలు

image

నేడు బంగారం ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రా. బంగారం రూ.770 తగ్గి రూ.1,27,850కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రా. పసిడి రూ.700 పడిపోయి రూ.1,17,200గా నమోదైంది.

News November 14, 2025

ఒక రౌండ్ అంటే ఏమిటి?

image

ఎన్నికల ఓట్ల కౌంటింగ్ రోజున ‘రౌండ్’ అనే పదం తరచూ వినిపిస్తూ ఉంటుంది. X అనే వ్యక్తి మొదటి రౌండ్‌లో ముందంజలో ఉన్నారు అని వింటాం. ఒక రౌండ్ అంటే 14 EVMల ఓట్ల లెక్కింపు. ప్రతి EVM ఒక బూత్‌ను సూచిస్తుంది. కాబట్టి ఒక రౌండ్ 14 బూత్‌ల ఓట్ల లెక్కింపు అని కూడా చెప్పొచ్చు. ఒక్కో అసెంబ్లీ స్థానంలో ఓట్ల లెక్కింపు కోసం EC ఒకేసారి 14 టేబుళ్లను ఉంచుతుంది. ఒక్కో టేబుల్‌పై ఒక EVM ఉంటుంది.