News June 1, 2024

KK సర్వే.. అనంత జిల్లాలో టీడీపీకి 13, ధర్మవరం బీజేపీదే..!

image

ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్‌ను కేకే సర్వే వెల్లడించింది. మొత్తం 14 సీట్లకు గాను 13 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగరవేయనున్నారని వెల్లడించింది. వైసీపీ ఖాతా తెరిచే అవకాశమే లేదని అంచనా వేసింది. ఒక స్థానంలో బీజేపీ అభ్యర్థి గెలవనున్నారని పేర్కొంది. కాగా ధర్మవరంలో మాత్రమే బీజేపీ పోటీ చేయగా సత్యకుమార్ యాదవ్ గెలిచే అవకాశం ఉన్నట్లు పరోక్షంగా తెలిపింది.

Similar News

News January 15, 2025

కాకి అనే ఊరు ఉందని మీకు తెలుసా?

image

కొన్ని ఊర్ల పేర్లు వింటే ఇవి నిజంగానే ఉన్నాయా? అనే సందేహం వస్తుంది. శ్రీసత్యసాయి జిల్లా రొల్ల మండలంలోని ‘కాకి’ అనే గ్రామం కూడా ఇదే కోవలోకి వస్తుంది. దీని పూర్తిపేరు కాంచన కిరీటి. ఏపీలో చివరి గ్రామంగా, కర్ణాటకకు సరిహద్దుగా ఉంటుంది. 2011 జనాభా ప్రకారం ఈ గ్రామంలో 838 ఇళ్లు ఉన్నాయి. దాదాపు 3వేలకు పైగా జనాభా ఉన్నారు. ఇలా మీకు తెలిసిన గ్రామం పేర్లు ఉంటే కామెంట్ చేయండి.

News January 15, 2025

ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్‌ని కలిసిన కలెక్టర్

image

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి శాంతిభవనంలో ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్‌ని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ కలిశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఎస్పీ రత్న, ఆర్డిఓ సువర్ణ, తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. అలాగే జిల్లాలో తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

News January 14, 2025

ధర్మవరం లాడ్జిలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్

image

ధర్మవరంలోని పీఆర్‌టీ సర్కిల్ వద్ద గల కృష్ణ లాడ్జిలో శివరాఘవ రెడ్డి(22) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అద్దెకు తీసుకున్న రూమ్‌లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. శివరాఘవ రెడ్డి నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం ఉమ్మాయి పల్లికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. బెంగళూరులో ఒక ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు.