News June 1, 2024
KK సర్వే.. అనంత జిల్లాలో టీడీపీకి 13, ధర్మవరం బీజేపీదే..!
ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్‌ను కేకే సర్వే వెల్లడించింది. మొత్తం 14 సీట్లకు గాను 13 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగరవేయనున్నారని వెల్లడించింది. వైసీపీ ఖాతా తెరిచే అవకాశమే లేదని అంచనా వేసింది. ఒక స్థానంలో బీజేపీ అభ్యర్థి గెలవనున్నారని పేర్కొంది. కాగా ధర్మవరంలో మాత్రమే బీజేపీ పోటీ చేయగా సత్యకుమార్ యాదవ్ గెలిచే అవకాశం ఉన్నట్లు పరోక్షంగా తెలిపింది.
Similar News
News September 14, 2024
ATP: సీఎం ఎస్కార్ట్ వాహన కానిస్టేబుల్ హఠాన్మరణం
సీఎం చంద్రబాబు ఎస్కార్ట్ వాహన డ్యూటీ నిమిత్తం విజయవాడకు వెళ్లిన ఏఆర్ కానిస్టేబుల్ చంద్రనాయక్ గుండెపోటుతో మృతి చెందారు. పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం మం. గరుగుతండాకు చెందిన చంద్రనాయక్ అనంతపురం జిల్లా సాయుధ పోలీసు విభాగంలో పనిచేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం సీఎం ఢిల్లీ పర్యటనలో భాగంగా విమానాశ్రయానికి వెళ్లేందుకు ఎస్కార్ట్ వాహనం సిద్ధం చేశారు. ఈ క్రమంలో చంద్రనాయక్ ఒక్కసారిగా కుప్పకూలి మరణించారు.
News September 14, 2024
అనంతపురంలో కిలో టమాటా రూ.30
★ అనంతపురంలోని కక్కలపల్లి మార్కెట్లో శుక్రవారం కిలో టమాటా రూ.30 పలికింది. కనిష్ఠ ధర రూ.16, సరాసరి ధర రూ.24 ప్రకారం మార్కెట్‌లో అమ్మకాలు జరిగాయి.
★ అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం చీనీ కాయలు టన్ను గరిష్ఠ ధర రూ.18 వేలు, కనిష్ఠ ధర రూ.10వేలు, సరాసరి రూ.15 వేలు పలుకాయి.
News September 14, 2024
గుంతకల్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?
ముంబై-చెన్నై మధ్య ప్రధాన జంక్షన్‌గా గుంతకల్లుకు పేరుంది. దక్షిణ మధ్య రైల్వేలోని 5 ప్రధాన డివిజన్‌లలో గుంతకల్ డివిజన్ 3వది. బ్రిటిష్ ఈస్టిండియా, బ్రిటిష్ ఇండియా పరిపాలన కాలంలోనూ రైలు ప్రయాణాల్లో గుంతకల్ ప్రాభవం పొందింది. అయితే పాత గుంతకల్లులో వెలసిన గుంతకల్లప్ప స్వామి పేరు మీద గుంతకల్లుకు ఆ పేరు వచ్చినట్లు చరిత్ర చెబుతోంది. ఈ నియోజకవర్గంలో కసాపురం, హజారత్ వలి మస్తాన్ దర్గా ప్రముఖ దర్శనీయ ప్రదేశాలు.