News July 6, 2024

ప్రభుత్వ సలహాదారుగా కేకే

image

TG: కే.కేశవరావును రాష్ట్ర సలహాదారుగా నియమిస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. పబ్లిక్ ఎఫైర్స్‌కు (ప్రజాసంబంధాల)కు ఆయన సలహాదారుడిగా వ్యవహరిస్తారని, ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తున్నట్లు జీవోలో పేర్కొన్నారు. కాగా ఇటీవల బీఆర్ఎస్ నుంచి కేకే కాంగ్రెస్‌లో చేరారు.

Similar News

News December 8, 2025

మెదక్: రెండో విడతలో ఏడు పంచాయతీలు ఏకగ్రీవం

image

మెదక్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఏడు సర్పంచి స్థానాలు, 254 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 8 మండలాల్లో 142 సర్పంచి, 1,035 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచి పదవులు ఏకగ్రీవమైన వాటిలో వెల్దుర్తి మండలం షౌకత్ పల్లి, నగరం, బస్వాపూర్, మెదక్ మండలం మల్కాపూర్ తండా, చిన్న శంకరంపేట మండలం మాందాపూర్ తండా, గవలపల్లి తండా, సంగాయపల్లి ఏకగ్రీవం అయ్యియి.

News December 8, 2025

మైసూరు పప్పు మాంసాహారమా?

image

పూజలు, వ్రతాల సమయంలో మైసూరు పప్పు తినకూడదంటారు. దీన్ని మాంసాహారంగా కూడా కొందరు భావిస్తారు. ఇందులో బద్ధకాన్ని కలిగించే తామస గుణాలుండటం అందుకు తొలి కారణం. అలాగే ఓ రాక్షసుడి రక్తం బొట్టు నుంచి ఈ పప్పు పుట్టిందని కొందరు పండితులు పేర్కొంటారు. పాల సముద్రాన్ని చిలకగా వచ్చిన అమృతాన్ని దొంగచాటుగా తాగిన సర్భాను తలను విష్ణు సుదర్శన చక్రంతో ఖండించాడట. ఆ రక్తపు చుక్కలు పడిన చోట ఇవి మొలిచాయని నమ్ముతారు.

News December 8, 2025

ఫైబ్రాయిడ్స్ లక్షణాలివే..

image

ఫైబ్రాయిడ్స్‌ ఉన్న మహిళల్లో నెలసరి స్రావంలో రక్తపు గడ్డలు కనిపించడం, నొప్పి ఉంటాయి. ఒకవేళ ఫైబ్రాయిడ్స్‌ చాలా పెద్దవిగా ఉంటే మూత్రాశయం మీద ఒత్తిడి పడి తరచూ మూత్రవిసర్జన చేయవలసి రావడం, మూత్రవిసర్జన పూర్తిగా జరగకపోవడం, జీర్ణ సమస్యలు వంటివి మొదలవుతాయి. కొన్ని రకాల ఫైబ్రాయిడ్లు గర్భసంచి లోపలి పొరల్లో ఏర్పడతాయి. వీటి వల్ల గర్భస్రావం జరిగిపోవడం, గర్భం దాల్చలేకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి.