News July 4, 2024

రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా

image

TG: రాజ్యసభ సభ్యత్వానికి కె.కేశవరావు(కేకే) రాజీనామా చేశారు. రాజ్యసభ ఛైర్మన్‌కు తన రాజీనామా లేఖను అందజేశారు. మరో రెండేళ్ల పదవీకాలం ఉన్నప్పటికీ పార్టీ మారిన నేపథ్యంలో ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. నిన్న AICC చీఫ్ ఖర్గే సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే. అంతకుముందు BRSలో ఉన్నారు.

Similar News

News November 5, 2025

పార్టీనే నాకు దైవం: కేశినేని చిన్ని

image

AP: తాను చంద్రబాబుకు వీర భక్తుడినని MP కేశినేని చిన్ని పేర్కొన్నారు. 20 నిమిషాల పాటు క్రమశిక్షణ కమిటీకి వివరణిచ్చి ఆయన వెళ్లిపోయారు. ‘పార్టీయే నాకు దైవం, చంద్రబాబు మాకు సుప్రీం. నాకు తిరువూరులో జరిగిన అవమానం కంటే MLA వల్ల పార్టీకి ఎక్కువ నష్టం జరిగింది. నియోజకవర్గ కార్యకర్తల అభీష్టం మేరకే పార్టీ నిర్ణయం ఉంటుందని అనుకుంటున్నా’ అని వ్యాఖ్యానించారు. ఈ తిరువూరు ఎపిసోడ్‌పై లోకేశ్ నివేదిక కోరారు.

News November 5, 2025

న్యూస్ రౌండప్

image

* US మాజీ ఉపాధ్యక్షుడు డిక్ చెనీ కన్నుమూత
* రాష్ట్ర పరిధిలో తిరిగే ప్రైవేట్ టూరిస్ట్ బస్సు‌లకు గ్రీన్ ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని, ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించి, చర్చలకు పిలవాలని AP ప్రైవేట్ బస్సు యజమానుల సంఘం డిమాండ్
* దుబాయ్‌లో మంత్రి నారాయణ పర్యటన.. రాష్ట్రంలో పెట్టుబడులకు అపరెల్ గ్రూపుకు ఆహ్వానం
* జూబ్లీహిల్స్ బైపోల్: హోమ్ ఓటింగ్ వినియోగించుకున్న 97 మంది సీనియర్ సిటిజన్లు, వికలాంగులు

News November 5, 2025

ఎస్‌బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

image

క్లర్క్ పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫలితాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసింది. మెయిన్స్‌కు ఎంపికైన వారి వివరాల పీడీఎఫ్‌ను వెబ్‌సైట్‌లో ఉంచినట్లు తెలిపింది. 6,589 జూనియర్ అసోసియేట్స్ పోస్టులకు సెప్టెంబర్ 20, 21, 27 తేదీల్లో పరీక్షలు నిర్వహించింది. ఫలితాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.