News February 3, 2025

KKD: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా పీజీఆర్ఎస్ రద్దు

image

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా కాకినాడ జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం రద్దుచేస్తున్నట్లు కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. తూర్పు-పశ్చిమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పూర్తయ్యే వరకు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. ఫిర్యాదుల కోరకు సంబంధిత సచివాలయంలో మీకోస పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

Similar News

News February 18, 2025

శుభ ముహూర్తం (మంగళవారం, 18-02-2025)

image

తిథి: బహుళ షష్ఠి తె.4.34 వరకు
నక్షత్రం: స్వాతి
రాహుకాలం: మ.3.00 నుంచి మ.4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుంచి మ.10.30 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.24- ఉ.9.12, తిరిగి రా.10.48- రా.11.36
వర్జ్యం: ఉ.11.46 నుంచి మ.1.32 వరకు
అమృత ఘడియలు: రా.9.51 నుంచి రా.11.33 వరకు

News February 18, 2025

సిరిసిల్ల: అడ్డుకట్ట వేస్తూ చర్యలు తీసుకోండి: ఎస్పీ

image

అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేస్తూ చర్యలు తీసుకోవాలని సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో వేములవాడ సబ్ డివిజన్ అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ అక్రమంగా ఇసుక తవ్వకాలు రవాణా చేపట్టే వారిపై చట్టపరమైన ఓ చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇసుకను అక్రమంగా రవాణాకు పాల్పడే వారిపై సున్నితంగా వ్యవహరించవద్దని స్పష్టం చేశారు.

News February 18, 2025

CMను ఆహ్వానించింన MLA బొజ్జల

image

తిరుపతి పర్యటకు వచ్చిన CM చంద్రబాబుకు రేణిగుంట ఎయిర్ పోర్ట్‌లో  శ్రీకాళహస్తి MLA బొజ్జల సుధీర్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన గుడిమల్లం పరశురామేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలకు రావాలని CMను ఆహ్వానించారు. అనంతరం ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ మాజీ ఛైర్మన్ అధికారులు పాల్గొన్నారు.

error: Content is protected !!