News March 19, 2025

KKD: ఢిల్లిలో పవన్ కళ్యాణ్‌, ఎంపీ తంగెళ్ల

image

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కలిశారు. మంగళవారం న్యూఢిల్లీలో జరిగి కేంద్ర వ్యవసాయ శాఖ‌ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడు వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో ఆయనకు కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌ను కలిసి ముచ్చటించారు.

Similar News

News November 28, 2025

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: హోంమంత్రి అనిత

image

AP: తుఫాన్ కారణంగా రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలకు హోంమంత్రి అనిత సూచనలు చేశారు. సోమవారం వరకు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వర్ష ప్రభావం అధికంగా ఉండే తిరుపతి, చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని, NDRF, SDRF బృందాలు సిద్ధంగా ఉంచాలన్నారు. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలన్నారు.

News November 28, 2025

ఆధార్ కార్డు బర్త్ సర్టిఫికెట్ కాదు: UP

image

ఆధార్ కార్డు విషయంలో అన్ని విభాగాలకు ఉత్తర్‌ప్రదేశ్ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ కీలక ఆదేశాలిచ్చింది. ఇకపై ఆధార్ కార్డును బర్త్ సర్టిఫికెట్‌గా, ప్రూఫ్ ఆఫ్ బర్త్‌గా గుర్తించడానికి వీల్లేదని పేర్కొంది. ‘ఆధార్‌కు జనన ధ్రువీకరణ పత్రం జత చేయరు. కాబట్టి ఇకపై దానిని బర్త్ సర్టిఫికెట్‌గా గుర్తించేందుకు వీల్లేదు’ అని ప్లానింగ్ విభాగం ప్రత్యేక కార్యదర్శి అమిత్ సింగ్ బన్సాల్ ఆదేశాలు జారీ చేశారు.

News November 28, 2025

SVU: పీజీలో సీట్లకు స్పాట్ అడ్మిషన్లు

image

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ (SVU)లో పీజీ (PG) కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ భూపతి నాయుడు పేర్కొన్నారు. డిసెంబర్ 1వ తేదీన స్పాట్ అడ్మిషన్ల ప్రవేశాల ప్రక్రియ జరుగుతుందన్నారు. ఇందుకు PGCET పాస్ అయిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో నేరుగా వర్సిటీలో హాజరుకావాలని ఆయన సూచించారు.