News March 19, 2025
KKD: ఢిల్లిలో పవన్ కళ్యాణ్, ఎంపీ తంగెళ్ల

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కలిశారు. మంగళవారం న్యూఢిల్లీలో జరిగి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడు వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో ఆయనకు కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌ను కలిసి ముచ్చటించారు.
Similar News
News April 20, 2025
ఈనెల 23న సాలూరులో జాబ్ మేళా: కలెక్టర్

సాలూరు శ్రీసత్యసాయి డిగ్రీ కళాశాలలో ఈనెల 23న జాబ్ మేళా జరగనుందని కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ ఆదివారం పేర్కొన్నారు. నిరుద్యోగ యువత జాబ్ మేళాలో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉపాధి కల్పనలో భాగంగా 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, ఏదైనా డిగ్రీ చదువుకొని 18 నుంచి 28 ఏళ్లు ఉన్న నిరుద్యోగులు జాబ్ మేళాకు అర్హులని పేర్కొన్నారు.
News April 20, 2025
రేపు వరంగల్ మార్కెట్ పునః ప్రారంభం

3 రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం పున: ప్రారంభం కానుంది. శుక్రవారం గుడ్ ఫ్రైడే, నిన్న, ఈరోజు వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో సోమవారం ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.
News April 20, 2025
జిల్లాలో నేను పెట్టిన రేట్లే ఉండాలి: జేసీ ప్రభాకర్ రెడ్డి

ప్రైవేటు బస్సు యజమానులపై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సు ఓనర్లం చిల్లర వ్యక్తులం అయ్యామని అన్నారు. తాను అనంతపురం జిల్లాలో మీటింగ్ పెడుతున్నానని తెలిపారు. జిల్లాలో నేను పెట్టిన రేట్లు మాత్రమే ఉండాలని అన్నారు. భారతదేశంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా బస్సులు తిప్పుకునే స్వేచ్ఛ ఉందన్నారు. తాను మొదటిసారిగా అన్ని ప్రాంతాలకు బస్సులు నడపానని తెలిపారు.