News March 31, 2025

KKD: తుది జట్టు నుంచి రాజును తప్పించిన ముంబై

image

కాకినాడ యువ క్రికెటర్ సత్యనారాయణ రాజును ముంబై ఇండియన్స్ తన మూడో మ్యాచ్లో తుది జట్టు నుంచి తప్పించింది. తొలి రెండు మ్యాచ్‌లకు అవకాశం ఇచ్చి మూడో మ్యాచ్లో పక్కన పెట్టింది. కేకేఆర్ మ్యాచ్‌లో రాజు స్థానంలో అశ్విని కుమార్‌ను బరిలోకి దింపింది. కాగా సత్యనారాయణ రాజు రెండు మ్యాచ్ల్లో కలిపి కేవలం ఒక వికెట్ తీశారు.

Similar News

News November 23, 2025

ఆన్‌లైన్‌లో సర్వపిండి, సకినాలు!

image

TG: సర్వపిండి, సకినాలు, కజ్జికాయలు, గవ్వలు వంటి పిండివంటలకు బ్రాండింగ్ కల్పించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఇప్పటికే మేడ్చల్(D)లోని మహిళా సంఘాలకు వీటి తయారీ, ఆకర్షణీయ ప్యాకింగ్, నాణ్యతా ప్రమాణాలపై శిక్షణ ఇప్పించారు. ప్రస్తుతం వీరు FSSAI ధ్రువీకరణతో విక్రయాలు చేస్తున్నారు. ఈ పిండివంటల అమ్మకాలు పెంచేందుకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలతోనూ ఒప్పందాలు కుదుర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు.

News November 23, 2025

పెద్దపల్లి కలెక్టరేట్‌లో సత్యసాయి బాబా జయంతి ఉత్సవాలు

image

పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు యువజన-క్రీడాశాఖ ఆధ్వర్యంలో ఆదివారం భగవాన్ శ్రీసత్య సాయి బాబా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సత్యసాయి బాబా చిత్రపటానికి అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) దాసరి వేణు పూలమాల వేసి సేవా స్ఫూర్తిని స్మరించారు. ఈ కార్యక్రమంలో యువజన-క్రీడాశాఖ అధికారి సురేష్, సేవా ట్రస్ట్ కన్వీనర్ లక్ష్మీనారాయణ, దాసరి రమేష్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

News November 23, 2025

టెక్ దిగ్గజాలందర్నీ ఒక చోటకు చేర్చిన AI

image

టెక్ బిలియనీర్ల ఫొటోలతో క్రియేట్ చేసిన ‘వన్ ట్రిలియన్ స్క్వాడ్’ AI పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, మార్క్ జుకర్‌బర్గ్, టిమ్ కుక్, సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, శామ్ ఆల్ట్‌మన్, జెన్సెన్ హువాంగ్‌ను ఏఐ సహాయంతో పార్టీలో ఉన్నట్టుగా క్రియేట్ చేశారు. సమాంతర విశ్వంలో ఒక చోట, సరదాగా కలుసుకున్న, వన్ ట్రిలియన్ స్క్వాడ్ సమావేశం అంటూ ఫొటోలకు క్యాప్షన్స్ ఇచ్చారు.