News February 23, 2025

KKD: నేడు గ్రూప్-2 పరీక్ష..పావుగంట ముందే గేట్ క్లోజ్

image

రాష్ట్ర వ్యాప్తంగా నేడు గ్రూప్ -2 పరీక్ష జరగనుంది. ఉదయం 10.గ నుంచి 12.30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 3.గ నుంచి 5.30 వరకు పేపర్-2 నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పరీక్ష ప్రారంభానికి గంటన్నర ముందుగానే ప్రధాన గేట్లును మూసివేస్తామని నిర్వాహకులు ప్రకటించారు. పరీక్ష కేంద్రాల వద్ద బీసీఆర్‌పీసీ సెక్షన్ 163 అమల్లో ఉంటుందన్నారు. షెడ్యూలు ప్రకారమే పరీక్షలు జరుగుతాయని ఎపీపీఎస్సీ బోర్డు తెలిపింది.

Similar News

News December 8, 2025

ఎకరాల భూమి ఉన్నా.. అమ్మలేరు..!

image

ప్రత్తిపాడు మండలం చింతలూరులో దశాబ్దాలుగా భూములన్నీ ఈనాం పరిధిలో ఉండటంతో, భూ పట్టాలు లేక రైతులు భూమిని అమ్ముకోలేక, కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదునుగా గ్రామంలోని కొందరు పెత్తందారులు రైతులు పండించుకుంటున్న భూమిపై పన్నులు కూడా వసూలు చేస్తున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని తమ ఈనాం సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

News December 8, 2025

మెదక్: ‘పెండింగ్ బకాయిల జాబితా విడుదల చేయాలి’

image

ఆర్థిక శాఖ అధికారులు ఉద్యోగులకు నవంబర్ నెల విడుదల చేసిన రూ.707.30 కోట్ల ఉద్యోగులకు రావలసిన పెండింగ్ బకాయిల టోకెన్ నెంబర్ల జాబితా విడుదల చేయాలని టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ డిమాండ్ చేశారు. సోమవారం ఉద్యోగులతో కలిసి మాట్లాడారు. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క నవంబర్ నెలకు సంబంధించిన రూ.707. 30 కోట్ల ఉద్యోగుల బకాయిలు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారన్నారు.

News December 8, 2025

కర్నూలు SP చెంతకు 119 ఫిర్యాదులు

image

కర్నూలు SP చెంతకు 119 ఫిర్యాదులు వచ్చాయని వాటిని విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. SP కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం 119 ఫిర్యాదులు స్వీకరించామన్నారు. ప్రజల సమస్యలను వ్యక్తిగతంగా విని సంబంధిత పోలీసులను త్వరితగతిన పరిష్కరించేందుకు జిల్లా SP విక్రాంత్ పాటిల్ ఆదేశించారు.