News February 2, 2025

KKD: బడ్జెట్‌జ్ లేకున్నా నిధులు సాధించే సత్తా కూటమిది

image

మధ్య తరగతి ప్రజానీకానికి ఊరటనిచ్చే విధంగా కేంద్ర బడ్జెట్ ఉందని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ప్రశంసించారు. రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఇవ్వడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పోలవరం నిర్మాణ వ్యయాన్ని సవరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం హర్షించదగ్గ పరిణామమని అన్నారు. బడ్జెట్‌జ్ లేకున్నా నిధులు సాధించే సత్తా కూటమికి ఉందన్నారు.

Similar News

News October 14, 2025

మిథున్ రెడ్డి నివాసాల్లో సిట్ తనిఖీలు

image

AP: హైదరాబాద్, బెంగళూరు, తిరుపతిలోని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి నివాసాలు, కార్యాలయాలపై సిట్ రైడ్స్ చేస్తోంది. లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఆయన ఇటీవలే బెయిల్‌పై విడుదలయ్యారు. ఈక్రమంలో మరోసారి సిట్ తనిఖీలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

News October 14, 2025

L.C.A-643 మిరప రకం ప్రత్యేకతలు ఇవే

image

పచ్చిమిర్చితో పాటు ఎండు మిర్చికి కూడా అనువైన రకం L.C.A-643. ఈ మిర్చి కాయలు లేత ఆకుపచ్చరంగులో పొడవుగా 13 నుంచి 14 సెంటీమీటర్ల వరకు ఉంటాయి. కాయలు ఎండిన తర్వాత కూడా కాస్త ముడతపడి ఆకర్షణీయమైన రంగులో ఉంటాయి. ఇది బెట్ట పరిస్థితులను తట్టుకుంటుంది. జెమిని వైరస్‌ను కూడా కొంత వరకు తట్టుకుంటుంది. నల్లతామర పురుగు సోకినా కొద్దిపాటి పురుగు మందులను పిచికారీ చేస్తే దీన్ని తట్టుకొని అధిక దిగుబడినిస్తుంది.

News October 14, 2025

గోదావరిఖని: ‘రుణాలు మంజూరు చేసి సహకరించాలి’

image

స్వశక్తి సంఘాలకు, వీధి వ్యాపారులకు ప్రభుత్వ పథకాల ద్వారా రుణాలు మంజూరు చేసి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు బ్యాంకు అధికారులు సహకరించాలని రామగుండం ఇన్‌ఛార్జి కమిషనర్‌ జే.అరుణశ్రీ అన్నారు. కార్పొరేషన్‌ కార్యాలయంలో సోమవారం టీఎల్‌బీసీ సమావేశం జరిగింది. సీనియారిటీ ప్రాతిపదికన స్వశక్తి సంఘాలకు బ్యాంకు లింకేజీ, వీధి వ్యాపారులకు పీఎం స్వనిధి రుణాలను మొదటి, 2వ, 3వ విడతలు సకాలంలో మంజూరు చేయాలని ఆమె కోరారు.