News March 7, 2025

KKD: మెగా సిటీ ఏర్పాటు చేయాలని సీఎంకు వినతి

image

కాకినాడలో సామర్లకోట, పెద్దాపురం మున్సిపాలిటీలను కలిపి మెగాసిటీ ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈ మేరకు కరపకు చెందిన కొందరు మేధావులు సీఎంకు వినతిపత్రం పంపారు. కాకినాడ సిటీతో పాటు రూరల్, పిఠాపురం, పెద్దాపురం, ముమ్మడివరం అనపర్తిలలోని 26 గ్రామాలను కలుపుతూ 53 కిలోమీటర్ల మేర రింగ్ రోడ్డు ఏర్పాటు వలన ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని వారు ప్లాన్ రూపొందించి బుద్ధాలసత్తిబాబు నేతృత్వంలో సీఎంకు పంపారు.

Similar News

News March 15, 2025

NLG: కృత్రిమ మేధాతో బోధన.. నేటి నుంచి ప్రారంభం

image

నల్గొండ జిల్లాలో ఎంపిక చేసిన ప్రాథమిక పాఠశాలల్లో నేటి నుంచి కృత్రిమ మేధాతో బోధన ప్రారంభం కానుంది. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 10 మండలాల్లో 14 పాఠశాలలను ఎంపిక చేశారు. అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) సాయంతో ప్రాథమిక విద్య బలోపేతం చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. చదువులో వెనుకబడిన పిల్లల కోసం ఎంపిక చేసిన పాఠశాలల్లో ఏఐ బోధన చేపట్టనున్నారు.

News March 15, 2025

ముత్తిరెడ్డి గూడెంలో క్షుద్ర పూజలు కలకలం

image

యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామంలో అయ్యప్ప టెంట్ హౌజ్ ఆవరణలో శుక్రవారం క్షుద్ర పూజల కలకలం రేగింది. గుర్తు తెలియని వారు టెంట్ హౌజ్ ఆవరణలో ఒక ఎర్ర బట్టలో పసుపు, ఎల్లిగడ్డ లాంటి పదార్థాలు వదిలి వెళ్లారు. గమనించిన స్థానికులు ఘటనా స్థలం వద్దకు చేరుకొని విషయాలపై అరా తీశారు.

News March 15, 2025

కౌటాల: గ్రూప్-2లో 191, గ్రూప్-3లో 349వ ర్యాంకు

image

ఆసిఫాబాద్ జిల్లా కౌటాలకి చెందిన <<15731264>>సాయిరాం గౌడ్ గ్రూప్-2, గ్రూప్-3 ఫలితాల్లో<<>> సత్తా చాటాడు. నిన్న విడుదలైన గ్రూప్-3 ఫలితాల్లో 349వ ర్యాంక్ సాధించి పలువురికి ఆదర్శంగా నిలిచాడు. అంతకుముందు విడుదలైన గ్రూప్- 2 ఫలితాల్లో 191వ ర్యాంకు సాధించాడు. గ్రూప్- 4లో జూనియర్ అసిస్టెంట్, గ్రూప్ -1 మెయిన్స్‌లోను 436 మార్కులతో సాధించాడు. ప్రస్తుతం బెజ్జూరు మండలం మొగవెల్లి JPS విధులు నిర్వహిస్తున్నారు.

error: Content is protected !!