News April 7, 2025

KKD: ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న బుకీ అరెస్ట్

image

ఐపీఎల్ సీజన్ ప్రారంభమవడంతో హనుమకొండ పోలీసులు బెట్టింగ్ రాయుళ్లను ఆదివారం అరెస్ట్ చేశారు. ఏజెంట్లకు మధ్యవర్తిగా వ్యహరిస్తున్న కాకినాడకు చెందిన క్రికెట్ బుకీ వీరమణికూమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. గోవాలోని యోగేశ్ గుప్తా బెట్టింగ్ లాభాల్లో 9% ఇస్తానని చెప్పడంతో పలువురితో బెట్టింగులు కట్టించాడు. కాకినాడలో ఓ ప్లాటు, రెండు మద్యం దుకాణాలు దక్కించుకున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Similar News

News April 9, 2025

పార్వతీపురం: ఈనెల 14న అంబేడ్కర్ జయంతి

image

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈనెల 14న బీఆర్.అంబేడ్కర్ జయంతిని నిర్వహిస్తున్నట్లు పార్వతీపురం మన్యం కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం 9 గంటలకు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి జంక్షన్, మెయిన్ రోడ్డు వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలను వేసి నివాళులు అర్పిస్తారని తెలిపారు. అనంతరం కలెక్టరేట్‌లో సమావేశం జరుగుతుందని చెప్పారు.

News April 9, 2025

MPలో విద్యార్థుల అటెండెన్స్.. ‘జై హింద్’ అనాలి

image

మధ్యప్రదేశ్‌లో విద్యార్థుల అటెండెన్స్ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ‘ప్రజెంట్ సర్/మేడమ్’కు బదులుగా ‘జై హింద్’ అని చెప్పాలని ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. క్యాబినెట్ మినిస్టర్ కున్వర్ విజయ్ షా కూడా దీనిపై ప్రకటన చేసినట్లు నేషనల్ మీడియా పేర్కొంది. కాగా, హరియాణా ప్రభుత్వం కూడా విద్యార్థులు, టీచర్లు ‘గుడ్ మార్నింగ్‌’కు బదులుగా ‘జై హింద్’ చెప్పేలా చర్యలు తీసుకుంది.

News April 9, 2025

బొబ్బిలి రైల్వే స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

బొబ్బిలి రైల్వే స్టేషన్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందినట్లు జీఆర్పీ హెచ్‌సీ ఈశ్వరరావు బుధవారం తెలిపారు. రెండో ప్లాట్‌ఫామ్‌పై మృతదేహం లభ్యమైందని చెప్పారు. మృతుడి ఆచూకీని తెలిపే ఎటువంటి ఆధారాలు తమకు దొరకలేదని అనారోగ్య కారణాలతో చనిపోయి ఉండవచ్చని ప్రాథమిక అంచనా వేసినట్లు తెలిపారు. ఫొటోలో ఉన్న వ్యక్తిని గుర్తు పడితే బొబ్బిలి రైల్వే పోలీసులను సంప్రదించాలని హెచ్‌సీ ఈశ్వరరావు కోరారు.

error: Content is protected !!