News October 31, 2025
KKD: ఎడమొహం పెడమొహంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ..?

KKD ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, MLC కర్రి పద్మశ్రీ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయని చర్చ సాగుతోంది. శ్రీలంక నుంచి మత్స్యకారులు వచ్చిన సందర్భంలో ఎమ్మెల్సీని కొండబాబు తోసేశారని ఆమె అనుచరులు ఆరోపించారు. తాజాగా గురువారం మత్స్యకారులకు బియ్యం పంపిణీ కార్యక్రమంలో పద్మశ్రీని వేదికపైకి ఆహ్వానించలేదని, దీంతో ఆమె కార్యక్రమం నుంచి వెళ్లిపోయారని వారు తెలిపారు.
Similar News
News November 1, 2025
పుష్ప, KGF కూడా అలా రిలీజ్ చేస్తారా?

‘బాహుబలి’ యూనివర్స్‌లో వచ్చిన 2 భాగాలను కలిపి ‘బాహుబలి-ది ఎపిక్’గా విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇలా 2 పార్టులుగా వచ్చి హిట్ అయిన సినిమాలపై చర్చ జరుగుతోంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప, పుష్ప-2, ప్రశాంత్ నీల్-యశ్ కాంబోలో వచ్చిన KGF, KGF-2ను కూడా ట్రిమ్ చేసి ఇలా ఒకే సినిమాగా రిలీజ్ చేస్తే బాగుంటుందని పలువురు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ కొత్త ట్రెండ్‌పై మీరేమంటారు?
News November 1, 2025
తిరుపతి: ఎకరాకు 3 బస్తాల యూరియా

తిరుపతి జిల్లాలోని రైతులకు ఎరువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాద్ రావు, అధికారులతో సమీక్షించారు. యూరియా కార్డుల ద్వారా ప్రతి రైతుకు ఎకరాకు 3బస్తాలు అందజేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దన్నారు.
News November 1, 2025
సంగారెడ్డి: కరాటే శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం

జిల్లాలోని 37 పీఎంశ్రీ పాఠశాలలో కరాటే శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. కుంగ్ ఫు, జోడో, కలర్ కలరిపయట్టు నేర్పించే ఏజెన్సీలు ఈనెల 3వ తేదీ వరకు కలెక్టరేట్‌లోని రెండో అంతస్తులో ఉన్న సమగ్ర శిక్ష కార్యాలయంలో దరఖాస్తు చేయాలని చెప్పారు. ఎంపికైన వారు విద్యార్థులకు కరాటే నేర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.


