News February 3, 2025

KKD: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా పీజీఆర్ఎస్ రద్దు

image

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా కాకినాడ జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం రద్దుచేస్తున్నట్లు కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. తూర్పు-పశ్చిమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పూర్తయ్యే వరకు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఆయన తెలిపారు. ఫిర్యాదుల కోరకు సంబంధిత సచివాలయంలో మీకోస పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

Similar News

News April 14, 2026

మధ్యాహ్నం కాకముందే వరంగల్‌లో భగభగలు!

image

ఉమ్మడి జిల్లాలో గత రెండు, మూడు రోజులుగా నమోదైన ఉష్ణోగ్రతలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఉ. 9:30 నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మహదేవర్‌పూర్, మల్హర్, పలిమెల, టేకుమట్ల మండలాల్లో 38 నుంచి 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో పనుల నిమిత్తం వెళ్లిన ఓరుగల్లు ప్రజలు అవస్థలు పడుతున్నారు. వడగాలులు వీచే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మీ గ్రామంలో ఎండ ఎలా ఉంది?

News April 14, 2026

ZHB: తమ్ముడి పెళ్లి.. ఇంతలో అక్క ఫ్యామిలీ దుర్మరణం

image

జహీరాబాద్‌కు చెందిన కవిరాజు(40)కు భార్య పావని(35), కుమార్తె కీర్తన(11), బాబు కార్తీక్ ఉన్నారు. దంపతులు ప్రైవేట్ జాబ్స్ చేస్తూ సంతోషంగా గడుపుతున్నారు. మే 1న పావని సోదరుడి పెళ్లి ఉండగా గడప కడిగేందుకు VKB జిల్లా రుక్మాపూర్‌కు <<19636029>>ఫ్యామిలీ<<>>తో కలిసి వెళ్లింది. సోమవారం ఉదయం స్కూటర్‌పై తిరిగి వస్తుండగా లారీ రూపంలో మృత్యువు కబలించింది. కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనతో పెళ్లింట తీవ్ర శోకం నిండింది.

News April 14, 2026

కామారెడ్డి: ఈనెల 15 నుంచి ఇంటర్ ప్రత్యేక తరగతులు

image

కామారెడ్డి జిల్లాలో ఆశించినంత మేర ఇంటర్ ఫలితాలు రాకపోవడంతో రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ నెల 15 నుంచి ఇంటర్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. ఫెయిలైన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, మే నెలలో నిర్వహించే అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలకు సిద్ధం చేస్తామన్నారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజులు చెల్లించాలని సూచించారు.