News April 2, 2025

KKD: కేంద్ర హోంమంత్రిని కలిసిన ఎంపీ సానా సతీష్

image

కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిసి రాష్ట్ర అభివృద్ధి గురించి ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబు తెలిపారు. మంగళవారం ఢిల్లీలో హోం మంత్రిని కలిసిన ఆయన పలు అంశాలపై చర్చించారు. ప్రత్యేకంగా రాజ్యసభలో కూటమి ఎంపీలు ఎలా వ్యవహరించాలి అనే దానిపై అమిత్ షాతో చర్చ జరిగిందని ఎంపీ సానా సతీష్ బాబు తెలిపారు. వక్ఫ్ బిల్లుపై ఓటింగ్‌కు తప్పనిసరిగా సభకు హజరుకావాలని అమిత్ షా సూచించారన్నారు.

Similar News

News April 3, 2025

ఏటూరునాగారం: 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు

image

ఇటీవల విడుదలైన జూనియర్ లెక్చరర్ ఫలితాల్లో ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లికి చెందిన అజారుద్దీన్ జూనియర్ లెక్చరర్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. గతంలో విడుదలైన టిజిటి, పిజిటి, గురుకులం జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు సైతం సాధించినట్లు తెలిపారు. 4 ఉద్యోగాలు సాధించగా అందులో జూనియర్ లెక్చరర్ (గెజిటెడ్) ఉద్యోగంలో చేరినట్లు పేర్కొన్నాడు. కాగా అజారుద్దీన్‌ను స్థానికులు ఘనంగా సత్కరించారు.

News April 3, 2025

గద్వాల: ‘GOVT జాబ్ కావాలా.. APPLY చేయండి..!’

image

ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ (క్లర్క్/ స్టోర్ కీపర్ టెక్నికల్), అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్ వివిధ కేటగిరీలకు ఆన్‌లైన్ అప్లికేషన్ ద్వారా దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారి డాక్టర్ ఎం.ప్రియాంక బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్‌కు 10వ తరగతి, 8వ తరగతి పాసైన వారు అర్హులన్నారు. SHARE IT

News April 3, 2025

మహబూబ్‌నగర్: GREAT.. ప్రజల కోసం రూ.లక్ష  

image

మహబూబ్‌నగర్ పట్టణంలో ప్రజల రక్షణ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పాలమూరు వాసులు మద్ది అనంతరెడ్డి, మద్ది యాదిరెడ్డి కలిసి జిల్లా ఎస్పీ జానకికి రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు బుధవారం చెక్కును ఎస్పీకి అందించారు. పట్టణంలో భద్రతను పెంపొందించేందుకు, నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఎస్పీ తెలిపారు. 

error: Content is protected !!