News February 6, 2025

KKD: డ్రోన్స్ వినియోగంపై పోలీసులకు శిక్షణ

image

కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్న 97 మంది పోలీస్ హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లకు డ్రోన్స్ వినియోగంపై ఎస్పీ బిందు మాధవ్ శిక్షణ ఇస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం రాత్రి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న శిక్షణను ఎస్పీ పరిశీలించారు. శిక్షణ తీసుకున్న వారితో ఎస్పీ మాట్లాడారు. గతంలో సీసీ కెమెరాలు, ఇప్పుడు డ్రోన్స్ వినియోగంతో మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పారు.

Similar News

News February 6, 2025

దేవాపూర్ సిమెంట్ కంపెనీ డ్రైవర్ మృతిపై కేసు

image

దేవాపూర్ సిమెంట్ కంపెనీలో పనిచేస్తున్న డ్రైవర్ రవీందర్ సింగ్(36)మృతిపై కేసు నమోదు చేసినట్లు SI ఆంజనేయులు తెలిపారు. రవీందర్‌కు మంగళవారం రాత్రి చాతిలో నొప్పి రావడంతో తోటి ఉద్యోగులు అతడిని కంపెనీ డిస్పెన్సరీకి, అనంతరం బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందినట్లు నిర్ధారించారు. అతడి భార్య మహిమ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు SI వెల్లడించారు.

News February 6, 2025

బీఆర్ఎస్ నేత హరీష్ రావుకు హైకోర్టులో ఊరట

image

గతంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ క్రమంలో ఈ కేసును కొట్టి వేయాలని హరీశ్ రావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో ఈ కేసును కొట్టి వేయాలని హరీశ్ రావు హైకోర్టును ఆశ్రయించారు. ఈనెల 12 వరకు అరెస్టు చేయొద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది.

News February 6, 2025

బోథ్: గుండెనొప్పితో ఉపాధ్యాయుడు మృతి

image

బోథ్‌లోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు దేవరాజ్ గుండెపోటుతో మృతి చెందాడు. ఇచ్చోడ మండలం కోకస్ మున్నూరు గ్రామానికి చెందిన దేవరాజ్ బుధవారం ఎప్పటిలాగే పాఠశాల విధులకు హాజరయ్యాడు. సాయంత్రం గుండెలో నొప్పి వస్తుందని తోటి ఉపాధ్యాయులకు తెలపడంతో వారు ఆయన్ను ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. డాక్టర్లు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.

error: Content is protected !!