News March 19, 2025

KKD: ఢిల్లిలో పవన్ కళ్యాణ్‌, ఎంపీ తంగెళ్ల

image

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కలిశారు. మంగళవారం న్యూఢిల్లీలో జరిగి కేంద్ర వ్యవసాయ శాఖ‌ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కుమారుడు వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో ఆయనకు కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌ను కలిసి ముచ్చటించారు.

Similar News

News December 20, 2025

సంగారెడ్డి: నూతన సర్పంచ్‌లు.. ముందు ఎన్నో సవాళ్లు!

image

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 22న నూతన సర్పంచ్‌లు పాలక పగ్గాలు చేపట్టనున్న నేపథ్యంలో రెండేళ్లుగా గ్రామాల్లో సర్పంచ్‌లు లేక ప్రధాన సమస్యలు తిష్ట వేశాయి. గ్రామానికి ప్రథమ పౌరుడైన సర్పంచ్ గ్రామంలో పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య సేవలు, వీధి దీపాలు, సమావేశాలు, మురికి కాలువలు వీటన్నింటినీ ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ గ్రామాలను ప్రగతిపథంలో నడిపే ఎన్నో సవాళ్లు వారి ముందుకు రానున్నాయి.

News December 20, 2025

ఈ నెల 22 నుంచి పోలీస్ కానిస్టేబుళ్లకు శిక్షణ

image

AP: సివిల్, APSP విభాగంలో కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 22 నుంచి శిక్షణ ప్రారంభిస్తున్నట్లు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా తెలిపారు. రాష్ట్రంలోని 21 పోలీస్ ట్రైనింగ్ కాలేజీలు, జిల్లా శిక్షణ కేంద్రాలు, బెటాలియన్‌లలో ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు 21వ తేదీ తమకు కేటాయించిన శిక్షణ కేంద్రాలకు చేరుకోవాలన్నారు. ఇటీవల వీరికి CM నియామక పత్రాలు అందజేసిన విషయం తెలిసిందే.

News December 20, 2025

యాక్టివేటెడ్ చార్‌కోల్‌తో ఎన్నో లాభాలు

image

యాక్టివేటెడ్ చార్‌కోల్ టాక్సిన్స్‌ను బయటకు పంపి, చర్మ రంధ్రాలను శుభ్రపరుస్తుంది. * యాక్టివేటెడ్‌ చార్‌కోల్‌ ఉన్న ఫేస్‌మాస్క్, ఫేస్‌వాష్ సెబమ్ ఉత్పత్తిని కంట్రోల్‌ చేస్తాయి. మీరు వేసుకునే ఏ ప్యాక్స్‌లో అయినా యాక్టివేటెడ్‌ చార్‌కోల్ మిక్స్‌ చేసుకోవచ్చు. * దీంట్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి మంట, చికాకును తగ్గించడంలో సహాయపడతాయి. ఇది సున్నితమైన చర్మం, రోసేసియా ఉన్నవారికి చాలా అనువైంది.