News March 31, 2025
KKD: తుది జట్టు నుంచి రాజును తప్పించిన ముంబై

కాకినాడ యువ క్రికెటర్ సత్యనారాయణ రాజును ముంబై ఇండియన్స్ తన మూడో మ్యాచ్లో తుది జట్టు నుంచి తప్పించింది. తొలి రెండు మ్యాచ్‌లకు అవకాశం ఇచ్చి మూడో మ్యాచ్లో పక్కన పెట్టింది. కేకేఆర్ మ్యాచ్‌లో రాజు స్థానంలో అశ్విని కుమార్‌ను బరిలోకి దింపింది. కాగా సత్యనారాయణ రాజు రెండు మ్యాచ్ల్లో కలిపి కేవలం ఒక వికెట్ తీశారు.
Similar News
News February 27, 2026
నర్సాపూర్: విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలి: కలెక్టర్

ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరగాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ స్పష్టం చేశారు. శుక్రవారం నర్సాపూర్‌లోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో జరుగుతున్న పరీక్షలను పరిశీలించారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరగాలని, విద్యార్థులకు ఏలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. తాగునీరు, విద్యుత్ సరఫరా, అత్యవసర మందులు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. తహశీల్దార్ శ్రీనివాస్, అధికారులున్నారు.
News February 27, 2026
సీబీఐపై కోర్టు తీవ్ర ఆగ్రహం

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణ సందర్భంగా రౌస్ అవెన్యూ కోర్టు సీబీఐపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఛార్జ్‌షీట్‌లో అనేక లోపాలున్నాయంటూ కేసును కొట్టివేసింది. సరైన ఆధారాలు లేకుండానే వారిని కేసులో ఇరికించారని మండిపడింది. అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, కల్వకుంట్ల కవిత సహా 23 మందికి కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. కాగా లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఈడీ కేసు నడుస్తోంది.
News February 27, 2026
విశాఖ: లారీ డ్రైవర్ ఆత్మహత్య

తమిళనాడుకు చెందిన లారీ డ్రైవర్, గాజువాక బెల్ కంపెనీ ఎదురుగా ఉన్న మైదానంలోని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. లారీతో కంపెనీకి వచ్చిన విజ్జి అనే డ్రైవర్ అడ్మిన్ బిల్డింగ్ ఎదురుగా మైదానంలో లారీ ఆపి శుక్రవారం ఉదయం లారీ క్యాబిన్ తలుపుకి తాడు కట్టి ఉరివేసుకున్నాడు. విషయం తెలుసుకున్న గాజువాక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.


