News February 6, 2025
KKD: డ్రోన్స్ వినియోగంపై పోలీసులకు శిక్షణ
కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉన్న 97 మంది పోలీస్ హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లకు డ్రోన్స్ వినియోగంపై ఎస్పీ బిందు మాధవ్ శిక్షణ ఇస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం రాత్రి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న శిక్షణను ఎస్పీ పరిశీలించారు. శిక్షణ తీసుకున్న వారితో ఎస్పీ మాట్లాడారు. గతంలో సీసీ కెమెరాలు, ఇప్పుడు డ్రోన్స్ వినియోగంతో మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పారు.
Similar News
News February 6, 2025
ఉద్యోగులకు పీఆర్సీ ఎప్పుడు?: బొప్పరాజు
AP: కూటమి ప్రభుత్వం వచ్చి 7 నెలలైనా ఉద్యోగుల సమస్యలపై చర్చించలేదని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. 12వ పీఆర్సీకి ఛైర్మన్‌ను నియమించలేదని దుయ్యబట్టారు. ఉద్యోగులు మధ్యంతర భృతి(IR) కోరతారనే నియామకాన్ని ఆలస్యం చేస్తున్నట్లు చర్చ జరుగుతోందన్నారు. తమకు రావాల్సిన బకాయిలపై క్లారిటీ ఇవ్వాలని, క్యాబినెట్ సబ్ కమిటీని నియమించాలని డిమాండ్ చేశారు.
News February 6, 2025
చైనా టెలికాం కంపెనీకి యూజర్ల లాగిన్ డేటా
చైనా డీప్‌సీక్‌తో యూజర్ల డేటా భద్రతకు ముప్పు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. US నిషేధిత చైనా ప్రభుత్వ టెలికాం కంపెనీ(చైనా మొబైల్)తో డీప్‌సీక్‌కు సంబంధాలు ఉన్నాయంటున్నారు. కంప్యూటర్ కోడ్ ద్వారా యూజర్ల లాగిన్ సమాచారాన్ని టెలికాం సంస్థకు పంపుతోందని పేర్కొంటున్నారు. కెనడాకు చెందిన ఫీరూట్ సెక్యూరిటీ సంస్థ తొలుత దీన్ని గుర్తించింది. ఇప్పటికే డీప్‌సీక్‌ను ఆస్ట్రేలియా, ఇటలీ, తైవాన్ నిషేధించాయి.
News February 6, 2025
KMM: గుడ్ న్యూస్.. ఒకేషనల్ స్టూడెంట్స్‌కు ఆహ్వానం
ఇంటర్మీడియట్ MPHW(ఫిమేల్) ఒకేషనల్ కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారికి ఏడాది క్లినికల్ అప్రెంటిస్ షిప్ శిక్షణకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కే.రవిబాబు ప్రకటనలో తెలిపారు. శిక్షణకు ఎంపికైన వారు రూ.1000 ఆసుపత్రి పేరున డీడీ చెల్లించాలన్నారు. గతంలో దరఖాస్తు చేసుకొని ఎంపిక కాని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు.